ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పెండింగ్ బకాయిలుగా రూ.745 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, హెల్త్ కార్డులు మరియు బీమా పథకాలతో మరిన్ని ప్రయోజనాలు ప్రకటించింది.

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యగులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు తాజాగా బకాయిలు విడుదలయ్యాయి. మరోవైపు గ్రామ పంచాయతీలకు సైతం రూ.389 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

ఇటీవల కేబినెట్ భేటీలో సైతం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి 60 ఏళ్ల లోపు మరణించిన సందర్భంలో ఇప్పటికే అందుతున్న ప్రయోజనాలతో పాటు.. అదనంగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షన‌ర్లకూ రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వ‌ర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ.1,056 కోట్ల మూల‌నిధితో ఉద్యోగుల, పెన్షన‌ర్ల ఆరోగ్య ప‌థ‌కానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17.7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం పొందే అవకాశం లభించనుంది. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 652 ఆసుపత్రుల్లో 1998 రకాల వ్యాధులకు చికిత్స అందించనున్నారు. ఈ హెల్త్ స్కీమ్ నిర్వహణ కోసం ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు ట్రస్టు ఖాతాలో జమ చేయనున్నారు. ఉద్యోగులతో సమానంగా ట్రస్టుకు ప్రభుత్వం సైతం జమ చేయనుంది.

ఇవి కూడా చదవండి :

Pakistan vs Afghanistan : అఫ్టానిస్తాన్ పై యుద్దం ప్రకటించిన పాక్… సూసైడ్‌ స్క్వాడ్‌ తో అప్ఘాన్?
Comedian | “సీరియల్స్ కంటే అడ్డ మీద కూలీ బెటర్” .. కమెడియన్ మహేష్ విట్టా సంచలన వ్యాఖ్యలు