Comedian | “సీరియల్స్ కంటే అడ్డ మీద కూలీ బెటర్” .. కమెడియన్ మహేష్ విట్టా సంచలన వ్యాఖ్యలు
Comedian | తెలుగు నటుడు, కమెడియన్ మహేష్ విట్టా సీరియల్స్ ప్రొడక్షన్ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ మద్దతు, ముఖ్యంగా సీరియల్స్‌లో పని చేసిన అనుభవాల గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడారు.
Comedian | తెలుగు నటుడు, కమెడియన్ మహేష్ విట్టా సీరియల్స్ ప్రొడక్షన్ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ మద్దతు, ముఖ్యంగా సీరియల్స్‌లో పని చేసిన అనుభవాల గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీరియల్స్ పని వాతావరణంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక ఇబ్బందులు.. భార్య అండ
మహేష్ విట్టా మాట్లాడుతూ, ఒక దశలో ఆర్థిక సమస్యల కారణంగా సీరియల్స్‌లోకి వెళ్లాలని ఆలోచించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తన భార్య ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. “మంత్లీ శాలరీ వస్తుంది కదా” అనే ఆలోచనతో సీరియల్స్ వైపు మొగ్గుచూపినప్పుడు, తన భార్యే తనను ఆపిందని తెలిపారు.
సినిమా అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ముందు నువ్వు చేసిన సినిమా రిలీజ్ చేసుకో. ఆరు నెలలు వేచి చూద్దాం. తర్వాత నిర్ణయం తీసుకుందాం అని ఆమె చెప్పిందని, ఆ మాటలతోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నానని మహేష్ చెప్పారు. తన కెరీర్‌లో భార్య ప్రోత్సాహం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
‘ఘోరం… చాలా ఘోరం’ అన్న అనుభవం
తాను చేసిన ఓ వెబ్ సిరీస్ అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ, అది సీరియల్ ప్రొడక్షన్ మాదిరిగానే అనిపించిందన్నారు. అక్కడి వాతావరణం గురించి మాట్లాడుతూ, “మనుషులుగా కూడా చూడరు. చాలా టార్చర్ ఉంటుంది. చాలా గలీజుగా ఉంటుంది,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అనుభవం తర్వాత “సీరియల్స్‌కు దండం రా నాయనా” అనిపించిందని స్పష్టం చేశారు. అయితే ఒకే ఒక ప్రొడక్షన్‌లో తాను అలాంటి అనుభవం ఎదుర్కొన్నానని, అన్ని చోట్లా పరిస్థితి అలా ఉండకపోవచ్చని కూడా ఆయన అంగీకరించారు.
“సినిమాలు వెయ్యిరెట్లు బెటర్”
సినిమాల్లో పనిచేయడం సీరియల్స్‌తో పోలిస్తే వెయ్యిరెట్లు మెరుగని మహేష్ విట్టా అభిప్రాయపడ్డారు. తెలుగువాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి సీరియల్స్‌లో తక్కువగా కనిపిస్తారని, ఇతర భాషలవారే ఎక్కువగా ఆ రంగంలో పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
“అవకాశాలు రాకపోతే దోశల బండి పెట్టుకుంటా”
సినిమాల్లో అవకాశాలు రాకపోతే కూడా తాను సీరియల్స్ వైపు వెళ్లనని స్పష్టం చేసిన మహేష్, “దోశల బండి పెట్టుకుంటా… అదీ మంచి బిజినెసే” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆ మాటల్లోనూ సీరియల్స్ ప్రొడక్షన్ వాతావరణంపై ఆయనకున్న నిరాశ స్పష్టంగా కనిపించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram