Shivaji Raja | శివాజీ రాజాకి పవన్ వార్నింగ్.. మెగా ఫ్యామిలీతో దూరం ఎలా పెరిగింది అంటే..!
Shivaji Raja | టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయో, అలాగే పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన వార్నింగ్ గురించి ఆయన వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Shivaji Raja | టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయో, అలాగే పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన వార్నింగ్ గురించి ఆయన వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శివాజీ రాజా చెప్పిన వివరాల ప్రకారం, తాను దాదాపు 30 ఏళ్ల పాటు మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో అత్యంత సన్నిహితంగా ఉన్నారని తెలిపారు. అయితే టాలీవుడ్‌ను కుదిపేసిన శ్రీరెడ్డి వివాదమే ఈ స్నేహానికి చెక్ పెట్టిందని వెల్లడించారు.
ఇదీ వివాదం ..
క్యాస్టింగ్ కౌచ్ అంశంపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు, అనంతరం మెగా కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి. ఆ సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా, తగిన చర్యలు తీసుకోలేదనే భావన పవన్ కళ్యాణ్‌లో ఏర్పడిందని ఆయన తెలిపారు.
దీంతో పవన్ కళ్యాణ్ నేరుగా ‘మా’ కార్యాలయానికి వచ్చి తీవ్రంగా స్పందించినట్లు శివాజీ రాజా గుర్తుచేశారు. “నెక్స్ట్ టైం నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా” అంటూ తనను బహిరంగంగా హెచ్చరించినట్లు ఆయన చెప్పారు.
శివాజీ రాజా వివరణ
ఈ ఘటనపై స్పందించిన శివాజీ రాజా, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై అప్పట్లోనే స్పందించామని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ విషయం పవన్ కళ్యాణ్‌కు తెలియకపోవడం వల్లే ఆయన అంతగా ఆగ్రహించారని వివరించారు.
అలాగే పవన్ హెచ్చరించినట్టుగానే తర్వాత జరిగిన ఎన్నికల్లో నాగబాబు తనకు వ్యతిరేకంగా పనిచేశారని, దాంతో తాను ఓటమి పాలయ్యానని వెల్లడించారు. ఈ ఒక్క సంఘటనతోనే దశాబ్దాల పాటు కొనసాగిన స్నేహం దూరమైందని ఆయన పేర్కొన్నారు.
సినీ ప్రస్థానం:
శివాజీ రాజా తెలుగు చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రల్లో మెప్పించారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 400కు పైగా సినిమాలు, అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు.
పెళ్లిసందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారి వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు గుర్తుండిపోయేలా నిలిచాయి. టెలివిజన్‌లో అమృతం సీరియల్ ద్వారా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కేవలం నటుడిగానే కాకుండా, పరిశ్రమకు సేవలందిస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా శివాజీ రాజా బాధ్యతలు నిర్వర్తించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram