ఉత్తారంధ్ర అభివృద్దిలో గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న బోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గవర్నర్ నజీర్,మంత్రి లోకేశ్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోదీకి చంద్రబాబు ఘన స్వాగతం పలికి వేదికపైన పొందూరు ఖాదీ శాలువాతో సన్మానించి, బొబ్బిలి వీణ బహుకరించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్ వే పై తొలిసారి ప్రధాని మోడీ ప్రత్యేక విమానం ల్యాండింగ్ కావడం విశేషం. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలువనుంది.
విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ ఓపెన్‌టాప్ జీపులో వెళ్తూ గిరిజనుల థింసా నృత్యాన్ని తిలకించారు. ఏకరూప దుస్తుల్లో భారీ సంఖ్యలో కళాకారులు పాల్గొన్న ఈ థింసా నృత్య ప్రదర్శన ఇప్పటికే ప్రపంచ రికార్డు (గిన్నిస్ వరల్డ్ రికార్డు) సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు సంస్కృతి, గిరిజన కళా వైభవాన్ని ప్రతిబింబించిన ఈ స్వాగత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు,పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు ప్రారంభం
హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ pic.twitter.com/CPg1YpcpTL
— News Line Telugu (@NewsLineTelugu) August 1, 2026