బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి?

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో యువకుడిని హతమార్చిన మ్యాన్ ఈటర్ పెద్దపులిని అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, మత్తుమందు సహాయంతో బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 06, 2026, 3:41 pm IST
Read Time: 5 mins
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి?

పాలమ్మిన పూలమ్మినా అంటూ తనదైన పంచ్ మార్క్ డైలాగ్ లతో సోషల్ మీడియాలో.. బోలా మనిషిగా రాజకీయాల్లో పేరొందిన మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారం మరోసారిి ఊపందుకుంది. తాజాగా ఓ కార్యకర్త బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు దూరమయ్యానని అంతా నన్ను మర్చిపోతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‍కు గుడ్ బై చెప్పి త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ మల్లారెడ్డి చేసిన కామెంట్స్ చేయడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్‍గా మారాయి. మల్లారెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి అనేది పార్టీ కార్యకర్తలు, నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

మల్లారెడ్డి అడుగులు బీజేపీ వైపుకేనా…

గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు, పార్టీ కార్యాలయానికి మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజులుగా మల్లారెడ్డి తెలంగాణ భవన్ వైపు కూడా వెళ్లడం మానేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లోనూ మునుపటిలా యాక్టివ్‍గా పాల్గొనడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు లాంటి ముఖ్యనేతలు ప్రెస్ మీట్లలో, కార్యక్రమాల్లోనూ మల్లారెడ్డి కనిపించకపోవడం గమనార్హం. ఆయన కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అనంతరం ఆయన కోడలు ప్రీతిరెడ్డి సైతం తెలంగాణ బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో బీజేపీలో చేరితే తమ కుటుంబానికి మొత్తం నాలుగు టికెట్లు ఇవ్వాలనే షరతు మీద మల్లారెడ్డి ఫ్యామిలీ ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీతో హామీ తీసుకునే పనిలో ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.