విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. త్వరలో బిగ్‌అప్‌డేట్ ఉంటుందని కొండా సురేఖ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
నిరీక్షణ దాదాపుగా ముగిసిపోయింది(వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్) అని, త్వరలో ఓ బిగ్ అప్‌డేట్ ఉంటుందని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీంతో కొండా సురేఖ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తనను బర్తరఫ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిపైన, కాంగ్రెస్ హైకమాండ్ పైన ఏమైనా సంచలన ఆరోపణలు చేస్తారా? లేక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?..అన్న అంశంపై చర్చలు రేగాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా ప్రకటించి మరో పార్టీలో చేరికకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారా? అన్న అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
కొండా సురేఖతో టచ్ లో పార్టీలు…!
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్న కొండా సురేఖ మురళి కుటుంబంతో బీఆర్ఎస్, బీజేపీ, జనసేన పార్టీలు టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం వినిపిస్తుంది. అయితే బీజేపీలో చేరాలంటే సురేఖ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్న కండీషన్ ఉండటంతో ఆమె ఆ పార్టీలోకి వెలుతారా? లేదా? అన్నది సందేహంగా కనిపిస్తుంది. మొత్తం మీద కొండా సురేఖ చెప్పిన బిగ్ అప్ డేట్ ఏమిటన్న అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
‘అది నా అధికారిక ఖాతా కాదు’ : మాజీ మంత్రి కొండా సురేఖ
‘త్వరలోనే బిగ్ అప్డేట్’ అంటూ కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేక్‌బుక్ ఖాతాలో వైరల్ అవుతున్న పోస్టు తనది కాదంటూ సురేఖ స్పష్టం చేశారు. ఆ ఫేస్‌బుక్ ఖాతా తనది కాదని, ఆ వార్తతో సంబంధం లేదని తెలిపారు. వివిధ సోషల్ మీడియా వేదికల్లో మా పేరుతో ప్రచారమవుతున్న వార్తలతో గానీ, పోస్టులతో గానీ మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నానని, మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను కింద జతపరిచాం అని, మీడియా మిత్రులు, ప్రజలు కేవలం ఈ అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా కొండా సురేఖ కోరారు.
మీడియా మిత్రులకు నమస్కారం..
వివిధ సోషల్ మీడియా వేదికల్లో మా పేరుతో ప్రచారమవుతున్న వార్తలతో గానీ, పోస్టులతో గానీ మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాము.
మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను కింద జతపరిచాము. మీడియా మిత్రులు మరియు ప్రజలు కేవలం ఈ అధికారిక ఖాతాల ద్వారా… pic.twitter.com/7LDlfRz0IX
— Konda Surekha (@iamkondasurekha) September 4, 2026