Volkswagen Tayron R-Line: నేరుగా ఫార్చూనర్నే ఢీకొట్టనున్న ఫోక్స్‌వ్యాగన్ ఎస్యూవీ
ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ R-Line భారత్‌లో త్వరలో విడుదల కానుంది. 201bhp ఇంజిన్, AWD, లగ్జరీ ఫీచర్లు, 9 ఎయిర్‌బ్యాగ్స్, ADASతో టొయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీగా నిలవనుంది.
Volkswagen Tayron R-Line India Launch: Toyota Fortuner Rival in the ring
విధాత ఆటో డెస్క్ | హైదరాబాద్:
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన స్థాయిని మరింత బలపర్చుకునే దిశగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కీలక అడుగు వేసింది. 2026 ఉత్పత్తుల వ్యూహంలో భాగంగా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ ఎస్యూవీ — టైరాన్ ఆర్–లైన్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది.
జర్మన్ సాంకేతికతతో కలగలిసిన లగ్జరీ, పవర్

టిగువాన్ R-Line కంటే పెద్దదిగా, ఆధునిక ఫీచర్లతో, స్పోర్టీ డిజైన్‌తో రూపొందిన టైరాన్ R-Line ప్రీమియం విభాగంలో ఫోక్స్‌వ్యాగన్‌కు కొత్త గుర్తింపుని తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకు వస్తోంది.
MQB EVO ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైన ఈ SUV, యూరో NCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించి, భద్రతాపరంగా కూడా విశ్వసనీయతను చాటుకుంది. 4,792 మి.మీ పొడవు, 2,789 మి.మీ వీల్‌బేస్‌తో ఇది విస్తారమైన ఇంటీరియర్ స్పేస్‌ను అందిస్తుంది.
డిజైన్ పరంగా R-Line ప్రత్యేక బంపర్లు, HD మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ లైట్‌బార్, ఇల్యూమినేటెడ్ వోక్స్‌వ్యాగన్ లోగో, 19-అంగుళాల అలాయ్ వీల్స్ వంటివి ఈ కారుకు రాజసాన్ని ఇస్తున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్‌తో స్పోర్టీ లుక్ కనిపిస్తుంది.
ఫీచర్లు, భద్రత, పనితీరులో క్లాస్ లీడర్

టైరాన్ R-Line లోపల అడుగుపెట్టగానే ఒక డిజిటల్ లగ్జరీ అనుభూతి కలుగుతుంది. 15-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 30 రంగుల ఆంబియెంట్ లైటింగ్ ఈ SUVకి ప్రీమియం లుక్ ఇస్తాయి.
హర్మన్ కార్డన్ 11-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, AR హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.ప్రధానంగా డ్రైవర్, కో-ప్యాసింజర్ సీట్లకు మసాజ్, వెంటిలేషన్, హీటింగ్, మెమరీ ఫంక్షన్ ఉండటం ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఇక భద్రతా సౌలభ్యాల విషయానికొస్తే, 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, ESC, హిల్ స్టార్ట్ & డిసెంట్ అసిస్ట్, పార్క్ అసిస్ట్ ప్లస్ వంటి అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి.

పనితీరులో భాగంగా ఇందులో 2.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 201 bhp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కలిపి 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 7.3 సెకన్లలో అందుకుంటుంది. ఈ SUV గరిష్టంగా 224 కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు. మొత్తంగా చూస్తే, టైరాన్ R-Line నేరుగా టయోటా ఫార్చూనర్, స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలవనుంది. ధర దాదాపు రూ.40 లక్షల నుండి మొదలవ్వచ్చని అంచనా.

ప్రీమియం లుక్, శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, డిజిటల్ లగ్జరీ కలయికతో Volkswagen Tayron R-Line భారత SUV మార్కెట్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026లో ఫోక్స్‌వ్యాగన్‌కు ఇది కీలక మైలురాయిగా మారనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram