Tension at Medaram | మేడారం జాతరలో ఉద్రిక్తత.. మంత్రి కాన్వాయ్‌పై భక్తుల దాడి
తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్స్మణ్ దర్శనానికి వెళ్లిన సమయంలో ఆయన కాన్వాయ్‌పై భక్తులు దాడి చేశారన్న ఆరోపణలతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భారీగా భక్తులు తరలిరావడంతో పాటు, విద్యుత్ అంతరాయం, ఏర్పాట్ల లోపాలు కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి.
Tension at Medaram Jathara After Devotees Attack Minister’s Convoy
- దర్శనానికి వెళ్లిన ఎస్సీ–ఎస్టీ మంత్రి లక్స్మణ్ వాహనాలకు నష్టం
- విద్యుత్ అంతరాయం, ఏర్పాట్ల లోపంతో భక్తుల ఆగ్రహం
విధాత ప్రతినిధి | వరంగల్:
Tension at Medaram | మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్స్మణ్ దర్శనానికి వెళ్లిన సమయంలో ఆయన కాన్వాయ్‌పై భక్తులు దాడి చేశారన్న ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సుమారు ఉదయం 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సారలమ్మ గద్దెల వద్ద దర్శనం కోసం మంత్రి కాన్వాయ్ ముందుకు సాగుతుండగా, భారీగా భక్తులు చేరడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. ఏర్పాట్లు సరిగా లేవంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాన్వాయ్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో నాలుగు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు కార్ల వెనుక అద్దాలు పగిలిపోగా, మరో కార్ పక్క తలుపు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram