Jubilee Hills fire accident| జూబ్లీహిల్స్ మంగళగౌరీ షోరూమ్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుస అగ్ని ప్రమాద ఘటనలు జనాన్ని భయపెడుతున్నారు. గురువారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మంగళ గౌరీ షోరూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల ధాటికి షో రూమ్ నాలుగంతస్తులలోని ఫర్నిచర్ అహుతైంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Feb 26, 2026, 12:18 pm IST
Read Time: 2 mins
Jubilee Hills fire accident| జూబ్లీహిల్స్ మంగళగౌరీ షోరూమ్ లో అగ్ని ప్రమాదం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుస అగ్ని ప్రమాద ఘటనలు జనాన్ని భయపెడుతున్నారు. గురువారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మంగళ గౌరీ షోరూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల ధాటికి షో రూమ్ నాలుగంతస్తులలోని ఫర్నిచర్ అహుతైంది. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైరింజన్లను వినియోగించి మంటలను అదుపు చేశారు. పక్కన ఉన్న ఇతర షాపులకు మంటలు విస్తరించకుండా మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

వస్త్ర కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు మంగళగౌరీ షోరూమ్ ముందు భాగంలో భారీ మందిరం సెట్ వేశారు. మంటల్లో ఆ మందిరం సెట్ పూర్తిగా దగ్ధమైంది. భవనం లోపల మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో కొంత కాలంగా ఈ షోరూమ్ లో ఎలాంటి స్టాక్ పెట్టకపోవడంతో .. వస్త్రాల క్రయవిక్రయాలు జరుగడం లేదని అధికారులు తెలిపారు. కేలవం మరమ్మతులకు సంబంధించిన మెటిరియల్ మాత్రమే మంటల్లో దగ్ధమైందని వెల్లడించారు. మంటలు చెలరేగిన సందర్బంలో లోపల ఉన్న నలుగురు కార్మికులను రక్షించామని, మంటలను పూర్తిగా అదుపు చేశామని అగ్నిమాపక అధికారులు తెలిపారు.