Kalpana | 69 ఏళ్లలోనూ అదే మ్యాజిక్‌.. ‘రంభా హో హో హో’తో మళ్లీ స్టేజ్‌ షేక్‌ చేసిన కల్పనా అయ్యర్

Kalpana | బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కల్పనా అయ్యర్ మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆమె పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ‘రంభా హో హో హో’ పాటే. దశాబ్దాలు గడిచినా ఆ పాటకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

  • By: sn |    movies |    Published on : Jan 31, 2026 9:03 AM IST
Kalpana | 69 ఏళ్లలోనూ అదే మ్యాజిక్‌.. ‘రంభా హో హో హో’తో మళ్లీ స్టేజ్‌ షేక్‌ చేసిన కల్పనా అయ్యర్

Kalpana | బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కల్పనా అయ్యర్ మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆమె పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ‘రంభా హో హో హో’ పాటే. దశాబ్దాలు గడిచినా ఆ పాటకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో అదే సూపర్ హిట్ సాంగ్‌కు కల్పనా అయ్యర్ స్టేజ్‌పై స్టెప్పులేయగా, అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో పాటు అభిమానంతో మురిసిపోయారు.69 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్‌, అదే జోష్‌ కనిపించడం చూసి సెలబ్రిటీలు, అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయిపోయారు.

ఒకప్పుడు వెండితెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ‘ఒరిజినల్ డ్యాన్సింగ్ క్వీన్’ మళ్లీ స్టేజ్‌పై సందడి చేయడం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి వేడుక మొత్తం కల్పనా అయ్యర్ ఎనర్జీతో ఊగిపోయింది. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను కల్పనా అయ్యర్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకున్నారు. ఆ సందర్భంగా ఆమె భావోద్వేగంగా స్పందించారు. “నిన్న రాత్రి సిద్ధాంత్ పెళ్లి వేడుకలో ఇది జరిగింది. నేను మళ్లీ ఇలా డ్యాన్స్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఒక స్నేహితుడు ఈ వీడియో క్లిప్ పంపితే చూసుకున్నాను. నిజంగా నేనేనా ఇలా డ్యాన్స్ చేసింది అని నాకే నమ్మకం కలగలేదు. చాలా కాలం తర్వాత డ్యాన్స్ చేశాను. ఆ సాయంత్రం నాకు చాలా ప్రత్యేకం” అని ఆమె పేర్కొన్నారు.

వీడియోలో కల్పనా అయ్యర్ ఊదా రంగు (పర్పుల్) పట్టు చీరలో అద్భుతంగా మెరిశారు. సాంప్రదాయ బ్లాక్ అండ్ గోల్డ్ బ్లౌజ్‌తో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. వయసు పెరిగినా ఆమె గ్రేస్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, స్టెప్పుల్లోని స్పీడ్ ఏమాత్రం తగ్గలేదని ఈ డ్యాన్స్ మరోసారి నిరూపించింది. 69 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో స్టేజ్‌ను షేక్ చేసిన ఆమెకు అక్కడున్న వారంతా కేరింతలు కొట్టారు.
‘రంభా హో హో హో’ పాటకు ఉన్న మ్యాజిక్ మరోసారి ప్రేక్షకులను తాకింది. 1981లో విడుదలైన ‘అర్మాన్’ సినిమాలోని ఈ పాట కల్పనా అయ్యర్‌ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. అప్పట్లో ఈ సాంగ్ ఓ సంచలనం సృష్టించింది. తాజాగా రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’లో ఈ పాటను మళ్లీ వాడటంతో, కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఈ పాట మరింత దగ్గరైంది. దీంతో కల్పనా అయ్యర్ పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వీడియోపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నటి శిల్పా శిరోద్కర్ ఆమెను “ది బెస్ట్” అంటూ ప్రశంసించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ “డ్యాన్సింగ్ క్వీన్” అని బిరుదు ఇచ్చారు. నటి డెల్నాజ్ ఇరానీ అయితే కల్పనా అయ్యర్‌ను “ది ఓజీ” (The OG – Original) అంటూ అభివర్ణించారు. ఖుష్బూ సుందర్, దివ్య దత్తా తదితరులు కూడా ఆమెపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాల తర్వాత కూడా తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలగడం కల్పనా అయ్యర్‌కే సాధ్యమని మరోసారి రుజువైంది.

 

View this post on Instagram

 

A post shared by FilmyKalakar (@filmykalakar)