ట్రెండింగ్‌లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్‌కు ఇండియా ఫిదా
‘పెద్ది’ సినిమాలోని ‘రయ్ రయ్ రా రా’ పాట యూట్యూబ్‌లో భారీ ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ డ్యాన్స్‌కు భారత్ మైమరచిపోతోంది. అనంత శ్రీరామ్ పవర్‌ఫుల్ లిరిక్స్, ఏఆర్ రెహమాన్ బీట్‌తో ఈ సాంగ్ 3 రోజుల్లోనే 3.3 కోట్ల వ్యూస్ సాధించింది. ఈ పాటకు ఇప్పటికే వేలాది రీల్స్ సోషల్‌మీడియాను ముంచెత్తుతున్నాయి.
‘పెద్ది’లో ‘రయ్ రయ్ రా రా’ పాటకు చెర్రీ డ్యాన్స్ మాస్ ట్రెండ్‌గా మారింది.
India Dances Along With Ram Charan as ‘Rai Rai Raa Raa’ Song Goes Viral
సారాంశం:
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలోని ‘రయ్ రయ్ రా రా’ పాట సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ అవుతోంది. చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు, అనంత శ్రీరామ్ పవర్‌ఫుల్ లిరిక్స్, ఏఆర్ రెహమాన్ మాస్ బీట్ కలిసి ఈ సాంగ్‌ను వైరల్ చేశాయి. విడుదలైన మూడు రోజుల్లోనే యూట్యూబ్‌లో 3.3 కోట్లకు పైగా వ్యూస్ సాధించి నెట్టింట సంచలనంగా మారింది.
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన రెండో పాట ‘రయ్ రయ్ రా రా’ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పాట విడుదలైన వెంటనే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో భారీగా ట్రెండ్ అవుతూ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఈ సాంగ్‌లో రామ్ చరణ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చరణ్ డ్యాన్స్ స్పీడ్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నిజంగానే స్ప్రింగులు మింగేశాడా అన్నట్టుగా కనిపిస్తోంది.

డ్యాన్సర్ల మధ్య చెర్రీ ఎనర్జిటిక్ స్టెప్పులు పాటకు ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఈ పాటలో చరణ్ ప్రతి మూమెంట్‌లోనూ అద్భుతమైన గ్రేస్ చూపించాడు. వేగంగా వచ్చే బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూనే, ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించే ఎనర్జీ ఈ సాంగ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ముఖ్యంగా పాటలోని సిగ్నేచర్ హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయి, వేలాది రీల్స్‌కు కారణమైంది.
రామ్‌చరణ్ తన అభిమాన డాన్సర్‌గా ఎన్టీఆర్‌ను పేర్కొంటారు. అటువంటిది ఈ పాటలో ఆయన్నే దాటిపోయాడనిపిస్తోంది. హృతిక్‌రోషన్, అల్లు అర్జున్‌ల డాన్స్‌లను మించిపోయేలా ఉన్న స్టెప్పులు యావత్ దేశాన్నే మైమరిపిస్తున్నాయి.
రెహమాన్ బీట్.. అనంత శ్రీరామ్ పదాలు

అనంత శ్రీరామ్ పదాలు, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ పాటకు ప్రత్యేక స్ఫూర్తినిచ్చాయి.
ఈ పాటకు ప్రధాన బలం అనంత శ్రీరామ్ రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్. ‘మండే గుండె నీలో లేదంటే, కాలు-చేయి ఉన్నా లేనట్టే’, ‘పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా’ వంటి పదాలు యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించేలా ఉన్నాయి. స్ఫూర్తినిచ్చేలా రాయబడ్డ ఈ పాట అనంత శ్రీరామ్‌కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పదాలకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన హై ఎనర్జీ బీట్ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. అంతేకాదు, ఈ పాటను రెహమాన్ స్వయంగా ఆలపించడం కూడా ఈ మోటివేషనల్ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రీల్స్‌లో చెర్రీ స్టెప్పుల జోరు

మాస్ బీట్‌కు తగ్గట్టుగా చెర్రీ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.
పాట విడుదలైన కొద్ది గంటల్లోనే ‘రయ్ రయ్ రా రా’ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో వేలాది మంది అదే హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు దేశమంతా రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టే కనిపిస్తోంది.

ఈ పాటలోని చెర్రీ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram