విధాత, హైదరాబాద్ : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. రష్మిక కథానాయికగా, ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.
పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తిచేసుకోవడంతో తొలుత సెప్టెంబరు 11న విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది. గురువారం చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. దసరా కానుకగా అక్టోబరు 16న ‘రణబాలి’ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది’ అని ఆసక్తికరమైన క్యాప్షన్ ను మూవీ టీమ్ రాసుకొచ్చింది. పెళ్లి తర్వాతా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తోన్న`రణబాలి` సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.