మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ముద్దుల కుమార్తె ‘క్లీంకార’ ముఖాన్ని ఎట్టకేలకు పరిచయం చేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో క్లీంకార ఫొటోలు షేర్ చేసినా ముఖం కనిపించకుండా ఎంతో జాగ్రత్తపడ్డారు. క్లింకార మూడో పుట్టిన రోజు సందర్భంగా పూర్తి ఫేస్ రివీల్ చేస్తూ క్యూట్ పిక్స్‌ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు 2023లో జన్మించింది చిన్నారి క్లీంకారా. అప్పట్నుంచి తమ కూతురు ఎక్కడా కెమెరాల కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. నేడు క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనతో క్లీంకార కలిసి ఉన్న ఫోటో ఉపాసన షేర్ చేశారు. తల్లిదండ్రుల మధ్య చిరునవ్వులు చిందిస్తూ… ముద్దులొలుకుతూ కనిపించిన క్లీంకారని తొలిసారి చూసిన నెటిజన్లు ఆశీర్వాదాలు, అభినందనల్లో ముంచెత్తారు. క్లీంకార తర్వాత రామ్‌చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జనవరి 31న జన్మించిన ఆ చిన్నారులకు శివ్‌రామ్, అన్వీరాదేవి అని నామకరణం చేశారు.
క్లింకార ఫస్ట్ లుక్ రివీల్ తో మెగా ఫ్యామిలీ నుంచి అభిమానులకు క్యూట్ సర్‌ప్రైజ్ అందినట్లయ్యింది. కింకారలో మెగా ఫ్యామిలీలో ఎవరి పోలికలు ఉన్నాయంటూ అభిమానులు ఆసక్తిగా క్లింకార ఫోటోను విశ్లేషించుకోవడంలో బిజీ అయిపోయారు.