తెలంగాణలో సెన్సస్ -2027పై కీలక ఉత్తర్వులు

తెలంగాణలో జనగణన(సెన్సస్ -2027)పై కీలక ఉత్తర్వులు జారీ అయ్యయి. కేంద్ర హోంశాఖ ఆగస్టు 14న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 4505(E)ను తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో పున:ప్రచురించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా జనాభా గణన ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 27, 2026, 5:22 pm IST
Read Time: 2 mins
తెలంగాణలో సెన్సస్ -2027పై కీలక ఉత్తర్వులు

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో జనగణన(సెన్సస్ -2027)పై కీలక ఉత్తర్వులు జారీ అయ్యయి. కేంద్ర హోంశాఖ ఆగస్టు 14న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 4505(E)ను తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో పున:ప్రచురించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా జనాభా గణన ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆగస్టు 29న తెలంగాణ గెజిట్‌లో నోటిఫికేషన్‌ ప్రచురించనున్నారు. సెన్సెస్ లో 40 రకాల వివరాల సేకరణకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. . 1948 సెన్సస్ చట్టంలోని నిబంధనల ప్రకారం నియమించబడే ఎన్యూమరేటర్లు ఇళ్లకు వెళ్లి ఈ వివరాలను సేకరించేందుకు అధికారం కల్పించారు.

జన గణనలో మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను లెక్కించి జాబితా రూపొందించనున్నారు. జన గణన ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభమై సెప్టెబర్ 30వ తేదీతో ముగియనుంది. అంతకు ముందే ఆగస్టు 17 నుంచి 31 వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.