తెలంగాణలో ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

తెలంగాణలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు ప్రభుత్వం కొత్త పథకం తెస్తున్నట్లుగా పేర్కొంది. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేస్తూ జీవో జారీ చేయడం విశేషం

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 27, 2026, 5:17 pm IST
Read Time: 3 mins
తెలంగాణలో ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు ప్రభుత్వం కొత్త పథకం తెస్తున్నట్లుగా పేర్కొంది. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేస్తూ జీవో జారీ చేయడం విశేషం.

హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణతోపాటు.. ఆటో డ్రైవర్ల ఇంధన వ్యయం తగ్గింపు లక్ష్యంగా ఈ పథకాన్ని తెంగాణ సర్కార్ అమలు చేయనుంది. రెట్రోఫిట్‌మెంట్‌ లేదా కొత్త ఈవీ ఆటోల కొనుగోలుకు రూ.1.5 లక్షల సాయం అందజేయనుంది. ఇటీవల ఆటో కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమణ ప్రకటన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటన మేరకు ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.

ఆటో ఛార్జీల సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జీవో విడుదల చేసేందుకు , ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే, ప్రైవేట్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ఓలా, ఉబర్‌ల తరహాలో ప్రభుత్వం తరఫునే సొంతంగా ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించేందుకు ఐటీ శాఖతో కలిసి పనిచేస్తామని ప్రభుత్వం పేర్కొంది.