విధాత, హైదరాబాద్ : నగర వాసులు సందర్శించేలా పర్యాటక కేంద్రంగా మిరాలం చెరువును సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మీరాలం చెరువు అభివృద్ది పనులను, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులను గురువారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. భారీ క్రేన్‌పై నుంచి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పనులను పరిశీలించారు.
గడువులోగా పనులు పూర్తి చేయాలని, చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మీరాలం నుంచి మూసీలోకి వరద వెళ్లేలా నాలాను విస్తరించాలని తెలిపారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ ఏర్పాటు చేయాలని, మీరాలం చెరువులో ఉన్న ఐ ల్యాండ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక్కడికి పర్యాటకులను రప్పించేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
🧐 మీరాలం చెరువును పరిశీలించిన సీఎం రేవంత్
🔹 భారీ క్రేన్‌పై నుంచి మీరాలం చెరువు పనులను సీఎం @revanth_anumula పరిశీలించారు.
🔹 చెరువు అభివృద్ధి, పునరుద్ధరణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.#TelanganaCongress #RevanthReddy pic.twitter.com/44kDf8sTxs
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) August 27, 2026