అరవింద్ నగర్ మత్తడి నాలా వంతెన పునర్నిర్మాణం : అశోక్‌నగర్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్‌లు
హైదరాబాద్ అశోక్‌నగర్ సమీపంలోని అరవింద్ నగర్ వద్ద హుస్సేన్ సాగర్ మత్తడి నాలా వంతెన పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో మార్చి 13 నుంచి ట్రాఫిక్ దారి మళ్లింపులు అమలు చేయనున్నారు. ఇందిరా పార్క్ చౌరాస్తా వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
అశోక్‌నగర్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్‌లు మార్చి 13 నుంచి మార్పులు… వాహనదారులు ముందుగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచన
Traffic Diversions Near Ashok Nagar in Hyderabad From March 13
- మార్చి 13 నుంచి మళ్లింపులు… వాహనదారులు ముందుగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచన
విధాత సిటీ బ్యూరో | హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలోని అశోక్‌నగర్ సమీపంలోని అరవింద్ నగర్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ మత్తడి నాలా వంతెనను తొలగించి కొత్తగా నిర్మించే పనులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ పనులు ప్రారంభం కావడంతో మార్చి 13 నుంచి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు అమలు చేయనున్నారు. ముఖ్యంగా నాయని నరసింహా రెడ్డి స్టీల్ బ్రిడ్జి కింద పిలర్ నంబర్లు 16, 17 మధ్య ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
ఇందిరా పార్క్ వైపు వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు
ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇందిరా పార్క్ చౌరాస్తా వైపు వెళ్లే వాహనాలకు ఈ విధంగా దారి మళ్లింపులు అమలు చేయనున్నారు.
1) హిమాయత్‌నగర్ స్ట్రీట్ నం.9 నుంచి ఇందిరా పార్క్ చౌరాస్తా వైపు వెళ్లే వాహనాలు
(రెండు చక్రాల వాహనాలు మినహా)
- అశోక్‌నగర్ చౌరాస్తా వద్ద దారి మళ్లింపు, అక్కడి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, బాకారం బ్రిడ్జి, ఎల్‌ఐసీ కాలనీ, బండమైసమ్మ చౌరాస్తా, ధర్నా చౌక్ మార్గ్.. అక్కడి నుంచి ఇందిరా పార్క్ చౌరాస్తా చేరుకోవాలి
2) ఆర్టీసీ చౌరాస్తా నుంచి ఇందిరా పార్క్ చౌరాస్తా వైపు వెళ్లే వాహనాలు
(రెండు చక్రాల వాహనాలు మినహా)
- అశోక్‌నగర్ చౌరాస్తా వద్ద దారి మళ్లింపు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, బాకారం బ్రిడ్జి, ఎల్‌ఐసీ కాలనీ, బండమైసమ్మ చౌరాస్తా, ధర్నా చౌక్ మార్గ్.. అక్కడి నుంచి ఇందిరా పార్క్ చౌరాస్తా చేరుకోవాలి
3) బాకారం నుంచి ఇందిరా పార్క్ చౌరాస్తా వైపు వచ్చే వాహనాలు
(రెండు చక్రాల వాహనాలు మినహా)
- బాకారం బ్రిడ్జి వద్ద దారి మళ్లింపు, అక్కడి నుంచి కుడివైపు తిరిగి ఎల్‌ఐసీ కాలనీ, బండమైసమ్మ చౌరాస్తా, ధర్నా చౌక్ మార్గ్.. అక్కడి నుంచి ఇందిరా పార్క్ చౌరాస్తా చేరుకోవాలి
ట్రాఫిక్‌కు సంబంధించిన తాజా సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా వేదికలు x, facebook లను పరిశీలించాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులు 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram