Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సినిమాల పండగ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘ప్యారడైజ్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే!

Netflix | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మరోసారి తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. “నెట్‌ఫ్లిక్స్ పండగ”లో భాగంగా త్వరలో తన వేదికపై స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాల జాబితాను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

  • By: sn |    movies |    Published on : Jan 16, 2026 2:16 PM IST
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సినిమాల పండగ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘ప్యారడైజ్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే!

Netflix | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మరోసారి తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. “నెట్‌ఫ్లిక్స్ పండగ”లో భాగంగా త్వరలో తన వేదికపై స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాల జాబితాను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి నేచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్, ఫాహద్ ఫాజిల్ వరకు స్టార్ హీరోల సినిమాలు ఉండటం విశేషం. థియేటర్లలో సందడి చేసిన సినిమాలతో పాటు అప్‌కమింగ్ భారీ ప్రాజెక్ట్‌లు కూడా నెట్‌ఫ్లిక్స్ లైనప్‌లో చోటు దక్కించుకున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

ఉస్తాద్ భగత్ సింగ్ – పవన్ కల్యాణ్ మాస్ ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ‘దేఖ్ లేంగే’ సాంగ్ మంచి బజ్ తెచ్చుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది.

ప్యారడైజ్ – నాని రా అండ్ రస్టిక్ అవతారం

నేచురల్ స్టార్ నాని పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్న సినిమా ప్యారడైజ్. ‘దసరా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. నాని ఇందులో పవర్‌ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఆకాశంలో ఒక తార – దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రయాణం

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న కొత్త సినిమా ఆకాశంలో ఒక తార. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కథ, కాన్సెప్ట్ పరంగా డిఫరెంట్‌గా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా కూడా థియేటర్ల తర్వాత నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఛాంపియన్ – పాజిటివ్ టాక్‌తో ఓటీటీ ఎంట్రీ

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన చిత్రం ఛాంపియన్. గత నెల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు బలమైన ఎమోషన్ ఉన్న కథగా ఈ మూవీ గుర్తింపు తెచ్చుకుంది.

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ – ఫాహద్ ఫాజిల్ ఇంటెన్స్ డ్రామా

మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కూడా నెట్‌ఫ్లిక్స్ లైనప్‌లో చేరింది. ఇంటెన్స్ కథ, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి, నెట్‌ఫ్లిక్స్ పండగతో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా కనిపిస్తోంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలు, అలాగే భారీ అంచనాలున్న అప్‌కమింగ్ మూవీస్ అన్నీ ఒకే ప్లేస్‌లో చూసే అవకాశం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది.