Mahesh Babu | మహేష్ బాబు అంటే ఆ క్రికెటర్‌కి అంత ఇష్టమా… స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు!
Mahesh Babu | మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా అభిమానులను సంపాదిస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాలను హిందీ డబ్బింగ్‌లో చూసి ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగుతోంది.
Mahesh Babu | మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా అభిమానులను సంపాదిస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాలను హిందీ డబ్బింగ్‌లో చూసి ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతున్న టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన తెలుగు సినిమాలు కూడా చూస్తానని తెలిపారు.
“మహేష్ బాబు స్టైల్ నాకు చాలా ఇష్టం”
శివమ్ దూబే మాట్లాడుతూ… “నేను టాలీవుడ్ సినిమాలు కూడా చూస్తాను. ఎక్కువగా హిందీ డబ్బింగ్‌లో చూస్తుంటాను. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్టైల్ చాలా బాగుంటుంది. క్లాస్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది” అని ప్రశంసించారు. మహేష్ బాబు వయసు పెరిగినా అదే లుక్, అదే చార్మ్ మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడు జాతీయ క్రికెటర్ నుంచే ఇలాంటి ప్రశంసలు రావడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ డ్యాన్స్‌పై కూడా ప్రశంసలు
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించీ శివమ్ దూబే ప్రస్తావించారు. “అల్లు అర్జున్ డ్యాన్స్ చాలా బాగుంటుంది. ఆయన నటించిన Pushpa: The Rise సినిమా చూసాను” అని అన్నారు. దీంతో టాలీవుడ్ హీరోల ప్రభావం ఎంత విస్తృతంగా ఉందో మరోసారి స్పష్టమైంది.
పాన్ వరల్డ్ దిశగా మహేష్…
ఇక మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మహేష్ పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు క్రికెట్ స్టార్ ప్రశంసలు, మరోవైపు రాజమౌళి సినిమా హైప్… ఇలా మహేష్ బాబు పేరు దేశవ్యాప్తంగా మరింత గట్టిగా వినిపిస్తోంది. శివమ్ దూబే చేసిన ఈ కామెంట్స్‌ను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram