Shanmukh | ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఎంగేజ్‌మెంట్… వైష్ణవి చోడిశెట్టితో కొత్త జీవితానికి శ్రీకారం,ఫొటోలు వైర‌ల్‌

Shanmukh | బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా యూట్యూబ్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించిన షన్ను, తర్వాత బిగ్ బాస్ తెలుగులో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఆ షో తర్వాత అతని వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింట్లోనూ ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

  • By: sn |    movies |    Published on : Feb 26, 2026 8:35 AM IST
Shanmukh | ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఎంగేజ్‌మెంట్… వైష్ణవి చోడిశెట్టితో కొత్త జీవితానికి శ్రీకారం,ఫొటోలు వైర‌ల్‌

Shanmukh | బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా యూట్యూబ్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించిన షన్ను, తర్వాత బిగ్ బాస్ తెలుగులో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఆ షో తర్వాత అతని వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింట్లోనూ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలోనే తాను మరోసారి ప్రేమలో ఉన్నానని వెల్లడించిన షణ్ముఖ్, అప్పట్లో తన ప్రేయసి ముఖాన్ని రివీల్ చేయకుండా బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరదించి, తన ప్రియురాలు వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం జరిగినట్టు అధికారికంగా ప్రకటించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫొటోలను షేర్ చేస్తూ “షణ్ముఖ్ జశ్వంత్ లవ్స్ వైష్ణవి చోడిశెట్టి – ఎంగేజ్‌డ్” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. చివర్లో “దేవుడి ప్లాన్ రివీల్ అయింది” అని పేర్కొనడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వైష్ణవి కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని సమాచారం.

షేర్ చేసిన ఫొటోల్లో ఈ జంట ఎంతో క్యూట్‌గా కనిపించడంతో “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే, బిగ్‌బాస్ బ్యాచ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు కానీ, షణ్ముఖ్ సన్నిహితులు కానీ ఈ పోస్టుపై స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా చిన్న కార్యక్రమానికైనా అభినందనలు వెల్లువెత్తే పరిస్థితుల్లో, ఈసారి నిశ్శబ్దం నెలకొనడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సమయానికి షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్‌గా మంచి క్రేజ్‌లో ఉన్నాడు. అప్పట్లో దీప్తి సున‌య‌న‌తో రిలేషన్‌లో ఉండేవాడు. అయితే హౌస్‌లో కో కంటెస్టెంట్‌ సిరితో అతను క్లోజ్ కావడం వివాదానికి దారి తీసింది. ఈ పరిణామాల ప్రభావంతో విన్నర్ అవుతాడని భావించిన షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచాడు. షో ముగిసిన కొద్ది రోజులకే దీప్తి సునయనతో బ్రేకప్ కావడం అతనికి పెద్ద షాక్ అయ్యింది.

ఆ తర్వాత పలు వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్న షణ్ముఖ్, ఇప్పుడు మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కెరీర్‌ను గాడిలో పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, షణ్ముఖ్ కొత్త జీవితానికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.