Ashu Reddy | కేసుల మధ్య అషూ రెడ్డి షాకింగ్ ట్విస్ట్.. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్, కాబోయే భ‌ర్త ఎవ‌రు?

Ashu Reddy | సోషల్ మీడియా సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అషూ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకవైపు ఆమెపై నమోదైన మోసం కేసు చర్చనీయాంశంగా మారుతుండగా.. మరోవైపు స‌డెన్‌గా షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అసలు అషూ రెడ్డికి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? లేక ఇది ఏదైనా షూటింగ్‌కు సంబంధించిన స్టిల్సా? అనే సందేహాలు ఇప్పుడు నెటిజన్లలో మొదలయ్యాయి.

  • By: Sandeep |    movies |    Published on : May 09, 2026 8:25 AM IST
Ashu Reddy | కేసుల మధ్య అషూ రెడ్డి షాకింగ్ ట్విస్ట్.. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్, కాబోయే భ‌ర్త ఎవ‌రు?

Ashu Reddy | సోషల్ మీడియా సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అషూ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకవైపు ఆమెపై నమోదైన మోసం కేసు చర్చనీయాంశంగా మారుతుండగా.. మరోవైపు స‌డెన్‌గా షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అసలు అషూ రెడ్డికి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? లేక ఇది ఏదైనా షూటింగ్‌కు సంబంధించిన స్టిల్సా? అనే సందేహాలు ఇప్పుడు నెటిజన్లలో మొదలయ్యాయి.

సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే టిక్‌టాక్ వీడియోల ద్వారా భారీ ఫాలోయింగ్ సంపాదించిన అషూ రెడ్డి, “జూనియర్ సమంత”గా సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్‌తోనే ఆమె బిగ్ బాస్ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది. హౌస్‌లో ఎక్కువ రోజులు కొనసాగకపోయినా, బయటకు వచ్చిన తర్వాత మాత్రం తన సోషల్ మీడియా ఇమేజ్‌ను మరింత బలంగా మలుచుకుంది.

సంచ‌ల‌న కేసుతో..

ప్రత్యేకంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ అషూ రెడ్డికి విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. ఆ తర్వాత యాంకర్‌గా, నటిగా పలు ప్రాజెక్టుల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. గ్లామర్ ఫొటోషూట్లు, రీల్స్, వీడియోలతో తన అభిమానులను అలరిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అయితే ఇటీవల ఆమె పేరు ఓ సంచలన కేసులో వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ధర్మేంద్ర అనే వ్యక్తి, “పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు తీసుకుందని” ఆరోపిస్తూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అషూ రెడ్డితో పాటు ఆమె తల్లి యశోదరెడ్డి పేరు కూడా చేరింది.

స‌స్పెన్స్ పెట్టిందిగా..

ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసు దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ అషూ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు వారికి ఊరటనివ్వలేదు. దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు, విచారణ సమయంలో కఠిన చర్యల నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో విచారణకు అషూ రెడ్డి హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి టెన్షన్ పరిస్థితుల్లోనే అషూ రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేయడం మరింత ఆసక్తి రేపుతోంది. ఆ ఫొటోలలో ఆమె ఎంగేజ్‌మెంట్ లుక్‌లో కనిపించగా, పక్కన ఓ వ్యక్తితో రింగ్స్ మార్చుకున్నట్లుగా కనిపించింది. అయితే ఫొటోలకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా కేవలం కెమెరా ఎమోజీ మాత్రమే పెట్టడం చర్చకు దారితీసింది.

ఇదేం ట్విస్ట్..

దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నిజంగానే ఎంగేజ్‌మెంట్ జరిగిందా?”, “లేక ఇది కొత్త సినిమా లేదా వెబ్‌సిరీస్ ప్రమోషనా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే ప్రస్తుతం కేసుల మధ్య ఇలాంటి పోస్ట్ రావడం వెనుక ఇంకేదైనా కారణం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు అషూ రెడ్డి నుంచి ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో, ఆమె నిజంగానే పెళ్లి బాట పడిందా లేదా అన్న ఆసక్తి మరింత పెరిగింది. మొత్తానికి ఒక్క పోస్టుతోనే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది అషూ రెడ్డి.