Anasuya | అర్ధరాత్రి తాగి ఫుల్‌గా ఏడ్చేశాను.. నన్ను చివరి నిమిషంలో తీసేశారు: అనసూయ భావోద్వేగ వ్యాఖ్యలు
Anasuya | బుల్లితెరపై యాంకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత వెండితెరపై నటిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మొదట చిన్నపాత్రలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, తర్వాత తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగారు.
Anasuya | బుల్లితెరపై యాంకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత వెండితెరపై నటిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మొదట చిన్నపాత్రలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, తర్వాత తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగారు. ముఖ్యంగా ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్రతో అనసూయకు భారీ గుర్తింపు లభించింది. ఆ పాత్ర ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి.
అయితే విజయాలతో పాటు తన సినీ ప్రయాణంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ పంచుకున్నారు. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో తాను ఎదుర్కొన్న సంఘటనలు ఇప్పటికీ మర్చిపోలేనివని ఆమె తెలిపారు.
చివరి నిమిషంలో తప్పించారు..
అనసూయ మాట్లాడుతూ.. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో వరుసగా మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు తనను ఎంపిక చేశారని చెప్పారు. అయితే ఆ తర్వాత ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండా చివరి నిమిషంలో ఆ చిత్రాల నుంచి తనను తప్పించారని వెల్లడించారు.
ఆ ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. “ఆ రోజు నాకు చాలా బాధగా అనిపించింది. అర్ధరాత్రి సమయంలో నా భర్తను పట్టుకుని చాలా ఏడ్చాను. ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం” అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
వేటికి భయపడను..
అదే సమయంలో తనపై సామాజిక మాధ్యమాల్లో జరిగే విమర్శలు, వ్యక్తిగత జీవితంపై వచ్చే పుకార్ల గురించి కూడా అనసూయ స్పందించారు. తాను వాటికి భయపడనని స్పష్టం చేశారు.
“నేను అప్పుడప్పుడు పరిమితంగా మద్యం తీసుకుంటాను. కానీ దాన్నే పెద్ద అంశంగా మార్చి నాపై తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అనేక రకాల వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నాకు అలవాటైపోయింది” అని ఆమె చెప్పారు.
ఇతరులు ఏమనుకున్నా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతానని, అనవసర విమర్శలతో తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని అనసూయ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ మద్దతు తెలుపుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram