Ashu Reddy | నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు .. భరత్ కాంత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్
Ashu Reddy | బిగ్‌బాస్ ఫేమ్, బుల్లితెర నటి అషు రెడ్డి తన ప్రాణ స్నేహితుడు, యువ నటుడు భరత్ కాంత్ అకాల మరణంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. భరత్ కాంత్ మృతి వార్తను జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Ashu Reddy | బిగ్‌బాస్ ఫేమ్, బుల్లితెర నటి అషు రెడ్డి తన ప్రాణ స్నేహితుడు, యువ నటుడు భరత్ కాంత్ అకాల మరణంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. భరత్ కాంత్ మృతి వార్తను జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భరత్ కాంత్‌తో పాటు యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన టాలీవుడ్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ ప్రతిభావంతులు ఒకేసారి మృతి చెందడం సినీ వర్గాలను కలచివేస్తోంది.
అషూ ఆవేదన..
భరత్ కాంత్ మరణ వార్త తెలిసిన వెంటనే అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. భరత్‌తో కలిసి దిగిన పాత ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ తన బాధను వ్యక్తం చేశారు.
“నీ మరణ వార్తను నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాను. మనం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నువ్వు నాపై చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. మా గుండెల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావు” అంటూ అషు రెడ్డి ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
సినీ ప్రముఖులు సైతం..
ఆమె పోస్ట్ చూసిన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో భరత్ కాంత్‌కు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
భరత్ కాంత్ ఇటీవల ‘టెనెంట్’ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే పలు వెబ్ సిరీస్‌లలో కూడా కీలక పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మరోవైపు సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా తన ప్రతిభతో ఇండస్ట్రీలో ముందుకు వస్తున్న యువ టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడిప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఈ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం టాలీవుడ్‌ను విషాదంలోకి నెట్టింది. వారి మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram