Robots Performing Kung Fu Moves | కుంగ్‌ఫూతో అద‌ర‌గొట్టిన రోబోలు.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

చైనాకు చెందిన హ్యూమ‌నాయిడ్ రోబోలు (China robots) కుంగ్ ఫూ (kung fu moves)తో అద‌ర‌గొట్టాయి. ఫ్లయింగ్‌ కిక్‌, స్పిన్‌, గాలిలోకి ఎగిరి తన్నడం, నేలపై వేగంగా గుండ్రంగా తిరగడం వంటి క్లిష్టమైన మూమెంట్స్‌ను మనుషుల మాదిరిగానే ఇది అలవోకగా చేస్తూ ఆక‌ట్టుకున్నాయి.

Robots Performing Kung Fu Moves

Robots Performing Kung Fu Moves | సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఊహకు కూడా అందనివి, స‌రికొత్త‌వి ఆవిష్కారం అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మ‌నిషికి సాధ్యం కాని ప‌నుల‌ను కూడా రోబోలు చేస్తూ ప్రపంచం దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ రోబోలు అన్ని రంగాల్లోనూ విస్త‌రించి త‌మ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన హ్యూమ‌నాయిడ్ రోబోలు (China robots) కుంగ్ ఫూ (kung fu moves)తో అద‌ర‌గొట్టాయి.

జర్మనీ ఛాన్స్‌లర్ (Germany Chancellor) ఫ్రెడరిక్ మెర్జ్ (Friedrich Merz) ప్ర‌స్తుతం చైనాలో పర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ రోబోల ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. స్టేజ్‌పై ‘యూనిట్రీ రోబోటిక్స్’ హ్యూమనాయిడ్ రోబోలు కుంగ్‌ఫూ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఫ్లయింగ్‌ కిక్‌, స్పిన్‌, గాలిలోకి ఎగిరి తన్నడం, నేలపై వేగంగా గుండ్రంగా తిరగడం వంటి క్లిష్టమైన మూమెంట్స్‌ను మనుషుల మాదిరిగానే ఇది అలవోకగా చేస్తూ ఆక‌ట్టుకున్నాయి. అక్క‌డున్న‌వారు ఈ రోబోల విన్యాసాల‌ను ఆద్యంతం ఆసక్తిక‌రంగా తిల‌కించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోని చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ రోబోలు అచ్చం మ‌నిషిలానే విన్యాసాలు చేస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో ప్రంచాన్ని ఈ రోబోలే ఏలుతాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Earthquake In Kolkata : కోల్‌కతాను వణికించిన భూకంపం..జనం పరుగులు
Urea Shortage | యూరియా కోసం మళ్లీ రైతుల పడిగాపులు.. పంట చేతికొచ్చే సమయంలో అష్టకష్టాలు

Latest News