Site icon vidhaatha

తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు విడుదల చేయండి: రాజ్యసభలో విజయసాయి రెడ్డి

విధాత:రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలతో పాటు నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో అసాధారణ వర్షాల తో పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం జరిగింది. సుమారు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ఆచూకీ దొరకలేదు. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా తక్షణ సాయం కింద రూ. 1000 కోట్లు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో విజయసాయి రెడ్డి వరదల అంశాన్ని లేవనెత్తుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల దృష్ట్యా తక్షణ సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నవంబర్‌ 16 నుంచి 18 తేదీల మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధా రణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయన్నారు.

వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు, విద్యుత్‌ లైన్లు, స్తంభాలు వరదలో కొట్టుకుపోయాయని వరదలు ముంచెత్తడంతో కొన్ని జలాశయాలు తీవ్రంగా దెబ్బ తిన్నా యన్నారు. వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధమైన పంట వరద నీటిలో కొట్టుకుపోయిందని సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు ధ్వంసమైయ్యాయని పేర్కొన్నారు.

Exit mobile version