Site icon vidhaatha

పాపం మూగ జీవాలు

విధాత: భారీ వర్షాలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్న సంగతి అందరికీ విధితమే.. ఈ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులు అవగా వందల సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. జాతీయ విపత్తు సిబ్బంది సహయక చర్యలు చేపట్టి చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాగా చాలా ప్రాంతాల్లో వాగులు, చెరువులు, ప్రాజెక్టులు తెగిపోవడంతో ఇంకా చాలా గ్రామాలు నీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. కానీ మూగ జీవాల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. తాము సురక్షితంగా బయట పడటానికి అనేక ఇబ్బందులు పడిన ప్రజలు తాము పోషిస్తున్న మూగ జీవాలను ఎలా రక్షించుకోవాలో తెలియక ఎక్కడి వాటిని అక్కడ వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలగా మూగ జీవాలు ఆ వరదల్లోనే కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో పశు సంపద నాశనమైంది. వరదల్లో పశువులు ఎలా కొట్టుకుపొతున్నాయో మీరు చూడండి… మీ హృదయం చలించక మానదు.

Exit mobile version