Site icon vidhaatha

నీటిగర్భంలో 13 ఏళ్ల అమ్మాయి మ్యాజిక్‌.. వరల్డ్‌ రికార్డు దాసోహం!

మ్యాజిక్‌లు చాలా మంది చేస్తారు. కానీ కొందరు చేసే మ్యాజిక్‌లు అబ్బురపరుస్తాయి. విస్మయానికి గురి చేస్తాయి. కొందరు వేదికలపై చేస్తే.. మరికొందరు గాల్లో చేస్తారు! కానీ.. ఈ అమ్మాయి అక్కడా ఇక్కడా కాదు.. ఏకంగా నీళ్లలో మ్యాజిక్‌ విన్యాసాలు ప్రదర్శించి.. ఔరా అనిపించింది. అదికూడా మూడే మూడు నిమిషాల్లో అత్యధిక మ్యాజిక్‌ ట్రిక్కులు చేసింది.


ముచ్చగొలిపే ఆమె ఇంద్రజాలానికి వరల్డ్‌ రికార్డు దాసోహం అన్నది.. ఎవరా అమ్మాయి.. ఏమా ఇంద్రజాలం! పదమూడేళ్ల వయసున్న ఆ అమ్మాయి పేరు అవెరీ ఎమర్సన్‌ ఫిషర్‌! అమెరికాకు చెందిన ఈ స్కూబా డ్రైవర్‌ మూడు నిమిషాలపాటు నీటిగర్భంలో ఉండి చేసిన ఇంద్రజాలం గిన్నెస్‌ రికార్డులకెక్కింది.

ఆమె చేసిన ఇంద్రజాల విన్యాసాల వీడియోను గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన అబ్బురపడిన నెటిజన్లు.. ఎమర్సన్‌కు వరల్డ్‌ రికార్డు దాసోహం అనడంలో ఆశ్చర్యం ఏముందని కామెంట్లు చేశారు. ఈ విన్యాసానికి ఈ అమ్మాయి లాక్‌డౌన్‌ సమయంలో సన్నాహాలు చేసుకున్నది.


క్వారంటైన్‌ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించిన ఎమర్సన్‌.. స్కూబా డైవింగ్‌ నేర్చుకున్నది. అనేక సవాళ్లు అధిగమిస్తూ.. ఆన్‌లైన్‌ పరీక్షల్లో పాల్గొన్నది. ఓపెన్‌ వాటర్‌ డైవర్‌ సర్టిఫికెట్‌ సంపాదించింది. అంకిత భావంతో పొందిన శిక్షణ ద్వారా 30కి పైగా ఓషన్‌ డైవ్స్‌ చేసి.. 12కుపైగా సర్టిఫికెట్లను పొందింది.

Exit mobile version