Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారుల, పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు ఆయా జిల్లాల మధ్య చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు తనిఖీల్లో రూ. 200 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలు, మద్యం, డ్రగ్స్‌తో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం ఇప్పటి వరకు రూ. 243.76 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఒక్కరోజే తనిఖీల్లో రూ. 78.03 కోట్ల సొత్తును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో రూ. 120.40 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు పట్టుబడ్డాయి. గడిచిన 24 గంటల్లో 83 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ కూసినప్పటి నుంచి గురువారం రాత్రి వరకు రూ. 87.92 కోట్ల నగదు, రూ. 10.21 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 7.72, కోట్ల విలువ చేసే డ్రగ్స్, రూ.1,20,40,71,205 విలువ చేసే నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 17,48,81,471 విలువ చేసే విలువైన కానుకలను కూడా సీజ్ చేశారు.