Site icon vidhaatha

Electoral Bonds | 22,217 ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేశాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన ఎస్‌బీఐ..

Electoral Bonds | ఎల‌క్టోర‌ల్ బాండ్లపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వ‌ర‌కు సుమారు 22,217 ఎల‌క్టోర‌ల్ బాండ్లను జారీ చేసినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 22,030 బాండ్లను రిడీమ్‌ చేసినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. బాండ్ల కేసులో బుధవారం ఎస్‌బీఐ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి డేటా సమర్పించినట్లు చెప్పింది. ఎన్నికల కమిషన్‌కు పెన్‌డ్రైవ్‌లో సమాచారాన్ని ఇచ్చినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. రెండు పీడీఎఫ్ ఫైల్స్‌ రూపంలో పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్షన్‌తో ఇచ్చినట్లు ఎస్‌బీఐ చెప్పింది. 2019 ఏప్రిల్ నుండి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేయబడిందని, సుప్రీంకోర్టు ఈ పథకాన్ని రద్దు చేయడానికి ముందు బ్యాంక్ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇందులో రాజకీయ పార్టీలు 22,030 బాండ్లను రీడీమ్ చేశాయి. మిగిలిన 187 మందిని రీడీమ్ చేసి, నిబంధనల ప్రకారం నగదును ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్లు బ్యాంక్ తెలిపింది.

ఎలక్టోరల్ బాండ్ల పథకం కింద.. తమకు నచ్చిన పార్టీలకు విరాళం ఇవ్వడానికి బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే, పార్టీలు 15 రోజుల్లోగా బాండ్లను రీడీమ్ చేసుకోవాలి. లేని పక్షంలో ఆ మొత్తం ప్రధానమంత్రి సహాయ నిధికి చేరుతుంది. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తన తీర్పులో ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొంది. బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని, విరాళాల వివరాలను ఈసీని సమర్పించాలని ఎస్‌బీఐ ఆదేశించింది. ఎస్‌బీఐకి డేటాను సమర్పించేందుకు కోర్టు మార్చి 6 వరకు గడువు విధించింది. అయితే, జూన్‌ 30 వరకు గడువును పొడిగించాలని కోర్టును ఎస్‌బీఐ కోరింది. ఎస్‌బీఐ అభ్యర్థతను తిరస్కరించింది. వివరాలను పంచుకోవాలని.. శుక్రవారం సాయంత్రంలోగా డేటాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఈసీని ఆదేశించింది.

Exit mobile version