Site icon vidhaatha

నీలి చిత్రాల నటి లియోన్‌ మృతి.. ఎందుకు చనిపోయిందంటే?

నీలి చిత్రాల నటి సోఫియా లియోన్‌ చనిపోయింది. ఆమె వయసు 26 ఏళ్లు. ఆమె తన అపార్ట్‌మెంట్‌ గదిలో నిశ్చేష్టంగా పడి ఉన్నదని ఆమె సవతి తండ్రి మైక్‌ రొమేరో గోఫండ్‌మీ అనే విరాళాల విజ్ఞప్తుల వేదికగా తెలిపారు. మియామికి చెందిన ఆమె మరణానికి కారణాలేంటనే అంశంపై చర్చ జరుగుతోంది. ‘2024, మార్చి 1వ తేదీన సోఫియా తన అపార్ట్‌మెంట్‌ గదిలో అచేతనురాలై పడి ఉండటం కనిపించింది. ఆమె మరణానికి కారణమేంటో స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’ అని రొమేరో తెలిపారు. ఆమె ఆకస్మిక మృతి తమను తీవ్ర విషాదంలోకి నెట్టిందని పేర్కొన్నారు. సోఫియా అంత్యక్రియలు, దర్యాప్తు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని తమ మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కష్టకాలంలో తమ పట్ల దయతో, ఉదారతతో వ్యవహరించినవారందరికీ ఆమె సవతితండ్రిగా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని పేర్కొన్నారు. సోఫియా మన మధ్య లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని అన్నారు. పైలోకంలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె అంత్యక్రియల కోసం సోషియా తల్లి వెరోనికా లోపెస్‌ తరఫున ఆరు వేల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఆయన సాధించారు. తన చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ సంతోషంలో ఉంచేదని, జంతువులు, తన పెంపుడు కుక్కలపై ఎంతో ప్రేమ ప్రదర్శించేదని రొమేరో పేర్కొన్నారు.


అడల్ట్‌ ఫిలిం ఇండస్ట్రీలో ఇటీవల వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన రెండు నెలల్లో కగ్నే లిన్‌ కార్టర్‌, జెస్సీ జేన్‌, థైనా ఫీల్డ్స్‌ చనిపోయారు. సోఫియాది నాలుగో మరణం. అయితే సోఫియా మరణంపై అడల్డ్‌ ఫిలిం ఇండస్ట్రీలో అనుమానాలు తలెత్తాయి. మార్చి 1న ఆమె చనిపోయినట్టు చెబుతున్న ఆమె కుటుంబీకులు.. ఇప్పటి వరకూ ఆమె మరణ వార్తను ఎందుకు బహిర్గతం చేయలేదనే ప్రశ్న తలెత్తుతున్నది. కొంతకాలంగా సోఫియా తమ ఫోన్స్‌ కాల్స్‌కు స్పందించడం లేదని ఆమె కుటుంబం చెబుతున్నది. ఇప్పుడు మార్చి 1న చనిపోయిందని విరాళాలు సేకరించేందుకు ఉద్దేశించిన వెబ్‌సైట్‌ ద్వారా తెలిజేయడం అనుమానాలకు తావిస్తున్నది. 


రెండు రోజుల క్రితమే ఇమిలీ విల్లీస్‌ అనే అడల్ట్‌ స్టార్‌ హాస్పిటల్‌ పాలయ్యారు. ఫిబ్రవరి 5న ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్పించారు. ఆమె ప్రస్తుతం లైఫ్‌సపోర్ట్‌ సిస్టమ్‌పై ఉన్నారు. ఉన్నట్టుండి అడల్ట్‌ ఫిలిం ఇండస్ట్రీలో వరుస మరణాలపై నెటిజన్లు తలో విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అడల్ట్‌ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలను ప్రశ్నించినందుకే ఇలా జరుగుతున్నదని కొందరు పేర్కొన్నారు. నిజం మాట్లాడితే చంపేస్తున్నారని ఒకరు రాశారు.

Exit mobile version