Site icon vidhaatha

అస‌లు వీడు కొడుకేనా..? త‌ల్లిని చెప్పుతో కొట్టి.. జుట్టు ప‌ట్టి లాగాడు

న‌వ మాసాలు మోసి క‌నిపెంచిన త‌ల్లిని ప్ర‌తి కుమారుడు కంటికి రెప్ప‌లా కాపాడుకోవాలి. త‌ల్లులు వృద్ధ్యాపంలో ఉంటే వారి బాగోగులు ద‌గ్గ‌రుండి చూసుకోవాలి. కానీ కొంద‌రు కొడుకులు మాత్రం క్రూర‌మృగాల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆమె త‌ల్లి అని మ‌రిచిపోయి.. దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఓ కుమారుడు త‌న త‌ల్లిపై దాడి చేసి, హింసించాడు. ఆమెను చెప్పుతో కొట్టి.. జుట్టు ప‌ట్టి లాగాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కౌశంబి జిల్లాలోని బ‌రువా గ్రామంలో వెలుగు చూసింది.

త‌ల్లి త‌న బ‌ట్ట‌లు మురికిగా చేసుకుంద‌ని.. ఆమె కుమారుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఇక త‌న ఇంటి ముందున్న త‌ల్లిపై దాడి చేశాడు. చెప్పుతో విచ‌క్ష‌ణార‌హితంగా చిత‌క‌బాదాడు. అంత‌టితో ఆగ‌కుండా ఆమె జుట్టు ప‌ట్టి నేల‌పై ఈడ్చుకెళ్లాడు. కుమారుడి దాడి నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. ఈ దారుణ ఘ‌ట‌న‌ను ప‌క్కింట్లో ఉన్న ఓ వ్య‌క్తి త‌న ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశాడు.

బాధితురాలిని చంద్ర సిన్హా(80) గా పోలీసులు గుర్తించారు. కుమారుడు సోను ఠాకూర్ అని పోలీసులు తెలిపారు. చంద్ర సిన్హా గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

Exit mobile version