విధాత: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారమని ఇండియాటుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వే తేల్చింది. ఇక్కడ మెజార్టీకి 46 స్థానాలు అవసరం ఉండగా.. కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాల మధ్య గెలుచుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బీజేపీ కనీసంగా 36, గరిష్ఠంగా 46 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. ఇతరులు ఒకటి నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొన్నది