SarathBabu
విధాత: నటుడు శరత్‌బాబు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 15 రోజుల క్రితం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు.
కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో గత కొద్ది రోజులుగా aig హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి ఈరోజు రెండు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. బాడీని చెన్నైకి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శరత్ బాబు(Sarath Babu) అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి ఆయన అభిమానులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.
శరత్‌బాబు తెలుగులో చివరగా పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్‌లో నటించగా సీనియర్ నరేశ్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి చిత్రం విడుదల కావాల్సి ఉంది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 220కి పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు పోషించారు.
శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో జన్మించారు. 1973లో రామరాజ్యం సినిమాతో ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు.
80ల్లో ఆయన కెరీర్ పీక్ స్టేజ్ లో సాగింది. అదే సమయంలో ఉత్తమ సహాయనటుడిగా 3సార్లు నంది అవార్డు కూడా అందుకున్నారాయన.