Bank Locker Rule | మీకు బ్యాంకు లాక‌ర్ ఉందా..? ఈ రూల్స్ గురించి తెలుసుకున్నారా..?

  • Publish Date - March 30, 2024 / 06:55 AM IST

Bank Locker Rule | దేశ‌వ్యాప్తంగా చిన్న బ్యాంకుల జాతీయ బ్యాంకుల వ‌ర‌కు అన్నీ లాకర్ సేవ‌లు సైతం అందిస్తున్నాయి. చాలా మంది విలువైన డాక్యుమెంట్లు, గోల్డ్‌, ఇరత వస్తువులను బ్యాంకు దాచుకుంటారు. ఇంట్లో దొంగ‌ల భ‌యం నేప‌థ్యంలో అంద‌రూ లాక‌ర్ల వైపు దృష్టి పెడుతుంటారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలో లాకర్ల వ్యవస్థ కీలకంగా ఉన్న‌ది. బంగారం, వజ్రాలు, విలువైన లోహాలకు సురక్షితమైన ఇంకా నియంత్రిత వాతావరణాన్ని అందిస్తుంది. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగమైనా అన్ని బ్యాంకులు కస్టమర్లకు లాకర్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే, బ్యాంకులు అందిస్తున్న లాక‌ర్ సేవ‌ల‌కు కొంత ఛార్జీల‌ను వ‌సూలు చేస్తుంటాయి. అయితే లాక‌ర్స్‌కు సైతం ప‌లు నిబంధ‌న‌లున్నాయి. ఇటీవల లాక‌ర్స్ రూల్స్ సైతం కొన్ని మార్పులు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. బ్యాంక్ లాకర్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీరు బ్యాంక్‌తో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేవైసీ లేకుండా లాకర్లను బ్యాంకులు ఇక‌పై అనుమ‌తించ‌వు. కేవైసీ కార‌ణంగా లాకర్‌ను తీసుకున్న కస్టమర్ వివరాలు అందుబాటులో ఉంటాయి. లాకర్ యాక్సెస్ చేసిన స‌మ‌యంలో లాకర్ గురించి సమాచారాన్ని పొందేవీలుంటుంది. బ్యాంకులు మీ అవసరాలు ఇంకా లభ్యత ప్రకారం లాకర్లను అందిస్తాయి. ఎవ‌రైనా త‌మ అవ‌స‌రానికి అనుగుణంగా లాక‌ర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ లేని స‌మ‌యంలో లాక‌ర్‌ను యాక్సెస్ చేసేందుకు నామినీ పేరును బ్యాంకులు త‌ప్ప‌నిస‌రి చేశాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు జ‌రిపేందుకు అవ‌కాశం ఉంటుంది. బ్యాంకులో లాకర్ కోసం దరఖాస్తు చేసిన స‌మ‌యంలోనే లాకర్ ఫీజులు.. రెంటల్ ఛార్జీల వివ‌రాల‌ను పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్ కోసం బ్యాంకుతో ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందం తప్పనిసరిగా నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై ఉండాల్సి ఉంటుంది. ఒప్పందం స‌మ‌యంలో ష‌ర‌తుల‌ను పూర్తిగా తెలుసుకోవాలి. లేక‌పోతే ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌దు. ఒప్పందం లాకర్ యాక్సెస్ విధానాలు, యాక్సెస్ సమయాలు ఇంకా గుర్తింపును చెప్పాల్సి ఉంటుంది. మీ లాకర్‌లో ఉంచిన వస్తువులను రక్షించడానికి బ్యాంకులు అనేక భద్రతా ప్రమాణాలను అనుస‌రిస్తుంటాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకారం.. ఇందులో బయోమెట్రిక్ యాక్సెస్, సీసీటీవీ కెమెరాలు, లాగ్ రికార్డులు ఉంటాయి. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు, అన‌ధికారిక యాక్సెస్ గుర్తిస్తే అప్ర‌మ‌త్త‌మై బ్యాంకులో సంప్ర‌దించాలి.

చాలా బ్యాంకులు లాకర్ భద్రతతో పాటు లాకర్‌లోని వాటికీ బీమాను అందిస్తుంటాయి. దొంగతనం, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు లాకర్‌లో ఉంచిన వస్తువులకు బీమాతో రక్ష‌ణ ఉంటుంది.

Latest News