ఒడిస్సా అడవుల్లో కనిపించిన అరుదైన వన్యమృగం

అరుదుగా కనిపించే వన్య మృగం బ్లాక్‌పాంథర్‌.. ఒడిశాలో ఇటీవల కనిపించింది.

  • Publish Date - December 1, 2023 / 01:00 PM IST

జంగిల్‌ బుక్‌ సినిమాలో మోగ్లీకి సహాయం చేసే నల్ల చిరుత భగీరా గుర్తుందా? అరుదుగా కనిపించే బ్లాక్‌పాంథర్‌.. ఇప్పుడు ఒడిశాలో కనిపించింది. అడవి జంతువుల అరుదైన దృశ్యాలను ప్రజలకు అందించే ఫారెస్టు అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌.. ఈ నల్ల చిరుత రాజఠీవితో ఉన్న దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.


దీన్ని చూసిన నెటిజన్లు.. అబ్బుపడుతున్నారు. తమకు అచ్చం రుడయర్డ్‌ కిప్లింగ్‌ రాసిన జంగిల్‌ బుక్‌ కథలో.. దాని ఆధారంగా అదే పేరిట తీసిన సినిమాలోనూ కనిపించిన భగీరా తమ యాదికి వచ్చిందని పేర్కొన్నారు. వన్యజీవుల విషయంలో కాస్వాన్‌.. సామాజిక మాధ్యమాలకు పరిచితులే.



 


ఆయన ఈ బ్లాంక్‌పాంథర్‌కు సంబంధించిన ప్రశ్న ఒకటి వేసి.. యూజర్లను ఆలోచింపజేశారు. ‘జంగిల్‌ బుక్‌ నుంచి నేరుగా వచ్చిందీ భగీరా. ఒడిశాలో ఇటీవల ఈ బ్లాక్‌పాంథర్‌ కెమెరాకు చిక్కింది. ఎంత అందమైన జంతువు! అయితే.. ఇండియాలో బ్లాక్‌పాంథర్స్‌ ఎక్కడ కనిపిస్తుంటాయి?’ అని క్యాప్షన్‌ జోడించారు. అందులోనే ప్రశ్న కూడా సంధించారు.

Tags:  

Latest News