Site icon vidhaatha

సీఎం స‌భ‌లో సీన్ రిపీట‌య్యింది! బంద్ చేయరా బాబు: కేసీఆర్ ఫైర్‌

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి:


తాను మాట్లాడుతుంటే సీటీలు కొట్టేవారిని.. నినాదాలు చేసేవారిని సీఎం కేసీఆర్ అప్పుడ‌ప్పుడు నిలువ‌రించేందుకు గ‌ట్టిగా మాట్లాడ‌టం తెలిసిందే. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లోనూ అదే సీన్ రిపీటైంది. తాను మాట్లాడుతుంటే కొంద‌రు ప‌దే ప‌దే ఈల‌లు వేయ‌డంపై ముఖ్య‌మంత్రి ఫైర్ అయ్యారు. మ‌ధ్య‌లో డిస్ట్ర‌బ్ చేయొద్ద‌ని ప‌దేప‌దే చెప్పారు. ‘మధ్యల డిస్ట్రబ్ చేయద్దు. సీటీ బంద్ చేయాలంటే, సీటీ కొడుతారా? అంటూ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సభలో సీటీలు కొట్టేవారిపై మండిపడ్డారు.


ఒక్కసారి కాదు మూడు సార్లు తీవ్రంగా స్పందించారు. ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడాల్నా? పోవాల్నా అంటూ మండిపడ్డారు. ఎందుకరుస్తున్నావు? కార్యకర్తలంటే పద్ధతుండాలి. కోఆపరేట్ చేయాలి అన్నారు. బంద్ చేయరా బాబు … ఎవర్రా వాడు, వాన్ని ఆగబట్టు….నేను ఏం మాట్లుతున్న నువ్వు ఏం అరుస్తున్నవురా ఔలా? బుద్దిలేదా? అంటూ ఫైరయ్యారు. వాన్ని ఆపండి, పిచ్చోడా? మాట్లాడాల్నా పోవాలరా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. గ‌తంలో కూడా చాలా స‌భల్లో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ఉంటే.. స‌భికులు పెద్ద పెట్టున ఈల‌లు వేయ‌డం, గోల చేయ‌డంపై సీరియ‌స్ అయ్యారు.

Exit mobile version