Site icon vidhaatha

గ‌జ్వేల్‌లో సీఎం ప్ర‌చార ర‌థాన్ని అడ్డుకొని వెనక్కి పంపిన మ‌హిళ‌లు

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సాక్షాత్తు సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో బీ అర్ ఎస్ పార్టీ ప్రచార రథాన్ని అడ్డుకుని అటవి శాఖ అభివృద్ది సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి,ప్రచారానికి వెళ్లిన నాయకులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేసి ప్రచార రథాన్ని వెనక్కి పంపిన సంఘటన జరిగింది. గజ్వేల్ నియోజక వర్గంలో నీ కొండపాక మండలం బందారం, గజ్వేల్ మండలం కొడకండ్లలో మార్కుక్ మండలం మర్కూక్ లో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నియోజక వర్గంలో ఒక్క గ్రామానికి దళిత బంధు రాలేదని,పేర్లు రాసుకున్నారు..కదా దళిత బంధు ఏమైందని ఆ గ్రామ మహిళలు ప్రశ్నించారు.


గ్రామాలలో సమస్యలు పరిష్కారం కాలేదని నిరసన వ్యక్తం చేశారు. అయా గ్రామలలో fdc చైర్మన్ ప్రతాప్ రెడ్డి పై మహిళలు,యువకులు ఫైర్ అయ్యారు. అడ్డు వచ్చిన బీ అర్ ఎస్ నేతలను తిట్టి పోషి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాలలో సమస్యలు పరిష్కారం చేసిన తరువాతనే ప్రచారానికి రావాలని మహిళలు డిమాండ్ చేశారు. నేతల సమన్వయ లోపమే ఈ నిరసనలకు కారణమని తెలుస్తోంది. ప్రతాప రెడ్డి పంపిన పేర్లు దళిత బంధు లో ఒక్కటి కూడా రాలేదని తెలిసింది. ఏది ఏమైనా బీ అర్ ఎస్ పార్టీ ప్రచార రథాన్ని అడ్డుకుని వెనిక్కి పంపిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Exit mobile version