Site icon vidhaatha

Viral Video | నాగుపాము ప‌డ‌గ‌తో బూట్లు.. మండిప‌డుతున్న నెటిజ‌న్లు

Viral Video | ఈ డిజిట‌ల్ యుగంలో త‌మ‌కంటూ ఓ గుర్తింపు రావాల‌నే ఉద్దేశంతో.. ఎన్నో వినూత్న ప్ర‌యోగాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అలా ప్ర‌యోగాలు చేసి కొంద‌రు విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు.. ఇంకొంద‌రు ప్ర‌శంస‌లు పొందుతున్నారు. తాజాగా ఓ వ్య‌క్తి నాగుపాము ప‌డ‌గ మాదిరిగా రెండు బూట్ల‌ను త‌యారు చేయించాడు. ఇక ఆ బూట్ల‌ను ధ‌రించి వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టాడు. ఇంకేముంది అత‌డిపై నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

నాగుపాము అనేది శివుడికి ఎంతో ప్రియ‌మైన‌ది. నాగుపామును హిందువులు పూజిస్తారు. అలాంటి నాగుపామును పాద‌ర‌క్ష‌లుగా వినియోగించి, హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. నాగుపాము ప‌డ‌గ మాదిరిగా బూట్ల‌ను త‌యారు చేసి పాద‌ర‌క్ష‌లుగా ధ‌రించ‌డం ఆమోద‌యోగ్యం కాద‌ని సూచించారు. ఇలాంటి చెడు ప‌నులు చేసే ముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏకంగా శివుడిని అవ‌మానించార‌ని మ‌రికొంద‌రు పేర్కొన్నారు. 

Exit mobile version