Diabetes | ఈ ప్రపంచంలో మధుమేహంతో బాధపడేవారు చాలా మందే ఉంటారు. డయాబెటిస్ ప్రభావం కాళ్ల నుంచి మొదలుకుంటే తల వరకు, శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు.. శృంగార జీవితంపై కూడా మధుమేహం ప్రభావం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే డయాబెటిస్ అనేది.. జన్యుపరమైన, పర్యావరణ కారకాల వల్ల కూడా వస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి లేకపోవడం కారణంగా కూడా డయాబెటిస్ వస్తుంది. కాబట్టి మెరుగైన జీవనశైలితో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు. బీపీ, కిడ్నీ, గుండె జబ్బుల పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో.. అదే స్థాయిలో డయాబెటిస్ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
శృంగార జీవితంపై ప్రభావం..
డయాబెటిస్ అనేది శృంగారం జీవితంపై ప్రభావం చూపిస్తుందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే దీని గురించి పెద్దగా చర్చించరు కాబట్టి. పురుషుల్లో అంగస్తంభన, శీఘ్ర స్కలనం వంటి సమస్యలు సంభవిస్తాయి. దీంతో శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోతారు. తద్వారా మహిళల లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మధుమేహం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జుట్టు రాలిపోయే ప్రమాదం..
శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. చర్మంపై కూడా డయాబెటిస్ ఎఫెక్ట్ ఉంటుంది. శరీరంలోని చక్కెర స్థాయిలు చర్మంపై మార్పులకు దారితీస్తాయి. మచ్చలు, బొబ్బలు, పింపుల్స్ వంటివి వచ్చే అవకాశముంటుంది. చర్మం పొడిబారడానికి, దురుదకు దారితీసే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది.
కంటి, నోటి సమస్యలు..
డయాబెటిస్‌తో బాధపడే వారికి కంటి శుక్లం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంధత్వం కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డయాబెటిస్‌తో బాధపడేవారు, పలు కారణలతో కంటి ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. మధుమేహంతో బాధపడేవారి నోటిలో ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. గొంతులో మంట వస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి.