డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ సోద‌రుడి ఆస్తులు రూ. 593 కోట్లు..!

క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డికే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేశ్ ఆస్తులు మ‌రింత పెరిగాయి. 2019 నుంచి ఈ ఐదేండ్ల కాలంలో ఆయ‌న ఆస్తులు 75 శాతం పెరిగిన‌ట్లు ఎన్నిక‌ల ఆఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం సురేశ్ ఆస్తులు రూ. 593 కోట్లు అని తేలింది.

  • Publish Date - March 29, 2024 / 03:17 AM IST

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డికే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేశ్ ఆస్తులు మ‌రింత పెరిగాయి. 2019 నుంచి ఈ ఐదేండ్ల కాలంలో ఆయ‌న ఆస్తులు 75 శాతం పెరిగిన‌ట్లు ఎన్నిక‌ల ఆఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం సురేశ్ ఆస్తులు రూ. 593 కోట్లు అని తేలింది. 2019 ఎన్నిక‌ల‌ప్పుడు స‌మ‌ర్పించిన ఆఫిడ‌విట్‌లో త‌న ఆస్తుల‌ను రూ. 339 కోట్లుగా సురేశ్ పేర్కొన్నారు.

డీకే సురేశ్ బెంగ‌ళూరు రూర‌ల్ నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఇదే స్థానం నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగారు. మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన సురేశ్‌.. బ్యాంకుల్లో రూ. 16.61 కోట్ల ఆస్తులు డిపాజిట్ల రూపంలో ఉన్నాయ‌ని తెలిపారు.

21 ప్రాంతాల్లో రూ. 32.76 కోట్ల విలువ చేసే వ్య‌వ‌సాయ భూములు ఉన్నాయి. మ‌రో 27 ప్రాంతాల్లో రూ. 210.47 కోట్ల విలువ చేసే వ్య‌వ‌సాయేత‌ర భూములు ఉన్నాయి. రూ. 211.91 కోట్ల విలువ చేసే క‌మ‌ర్షియ‌ల్ బిల్డింగ్స్‌తో పాటు రూ. 27.13 కోట్ల విలువ చేసే మూడు రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్స్ ఉన్న‌ట్లు సురేశ్ త‌న నామినేష‌న్ ప‌త్రంలో పేర్కొన్నారు. రూ. 150.06 కోట్ల అప్పులు ఉన్న‌ట్లు తెలిపారు. 

Latest News