Axis Bank Debit Card Rules | యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉందా..? ఈ డెబిట్‌కార్డుల రూల్స్ మారాయ‌ని తెలుసా..?

  • Publish Date - March 30, 2024 / 04:15 AM IST

Axis Bank Debit Card Rules | యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారుల‌కు అలెర్ట్‌. ఇటీవ‌ల బ్యాంకు ప‌లు కార్డుల‌కు సంబంధించిన నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించింది. బర్గుండి, డిలైట్, ప్రియారిటీ వంటి డెబిట్ కార్డులు సహా ఇతర కార్డులకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ సంబంధిత నిబంధనలను స‌వ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దాంతో పాటు బుక్ మై షో ఆఫర్లు, రివార్డ్ పాయింట్ రూల్స్ (EDGE రివార్డ్‌)లో సైతం కీల‌క మార్పుల‌ను తీసుకువ‌చ్చింది. దాంతో పాటు విదేశాల్లో డెబిట్ కార్డుల‌కు సంబంధించిన ఫీచ‌ర్‌లోనూ మార్పులు చేసింది. ఈ మేర‌కు బ్యాంకు ఖాతాదారుల‌కు మెయిల్స్ ద్వారా స‌మాచారం అందించింది. మెయిల్స్ ప్ర‌కారం.. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డును ఉపయోగించడం కొనసాగించాలనుకున్న స‌మ‌యంలో మే ఒక‌టి నుంచి డెబిట్‌కార్డులు లేదంటే ఖాతాలోని ఫీచ‌ర్స్కు సంబంధించి కీల‌క‌మైన మార్పులు చేసామ‌ని చెప్పింది.

బర్గుండి డెబిట్ కార్డుకు సంబంధించి విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్, డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ట్రాన్సాక్షన్లపై ఒక‌శాతం మార్కప్ ఫీ, బుక్ మై షో ఆఫర్స్, ఎడ్జ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లో స‌వ‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పింది. ఇక‌పై బర్గుండి డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్ డెబిట్ కార్డు ద్వారా చేసిన వ్య‌యంపై ఆధార‌ప‌డి ఉండ‌నున్న‌ది. మే ఒక‌టి త‌ర్వాత కాంప్లిమెంట‌రీ లాంజ్ యాక్సెస్ కోసం మూడునెల‌ల్లో కనీసం రూ.5వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త కార్డు తొలి నెలలో కనీసం ఖర్చు మాఫీ ఉంటుంది. ఆ తర్వాత యథావిధిగా మూడు నెలల నిబంధ‌న అమ‌లులోకి వ‌స్తుంది. ఇక డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ విషయంలో అంతర్జాతీయ వేదికలతో పాటు దేశీయంగా విదేశీ కంపెనీల్లో చేసే ట్రాన్సాక్షన్స్‌పై ఒక‌శాతం మార్కప్ ఫీ తో పాటు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ చెప్పింది.

స్వైప్ మెషీన్, ఆన్‌లైన్ ద్వారా చేసే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లకు డీసీసీ వర్తిస్తుంద‌ని తెలిపింది. అలాగే, బుక్ మై షో ఆఫ‌ర్స్‌లోనూ మార్పులు తీసుకుచ్చింది. బై వన్ గెట్ వన్ మూవీ టికెంట్ ఆఫర్ పొందాలంటే ఒకసారి కనీసం 2 టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. ఒక రోజులో ఒక కాంప్లిమెంటరీ టికెట్ మాత్రమే ఉంటుంది. నాన్ మూవీ టికెట్లపై బై వన్ గెట్ వన్ ఆఫర్ కోసం ట్రాన్సాక్షన్ లో కనీసం రెండు టికెట్లు బుక్ చేయాలి. రోజులో ఒక కాంక్లిమెంటరీ టికెట్ మాత్రమే వస్తుంది. బ్యాంక్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్లలోనూ మార్పులు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇంటి అద్దె, యుటిలిటీ సర్వీసులకు చేసే పేమెంట్లపై ఎలాంటి ఎడ్జ్ రివార్డ్ పాయింట్లు ఉండవని స్పష్టం చేసింది. యాకిస్ బ్యాంక్ బర్గుండి డెబిట్ కార్డు ద్వారా ఒక నెలలో గరిష్ఠంగా 2వేల ఎడ్జ్ పాయింట్లు మాత్రమే పొందే అవ‌కాశం ఉంటుంది.

Latest News