- నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
- ఏపీ, తెలంగాణలో మే 13న పోలింగ్
- ప్రకటించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్
- ఒకే విడతలో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు
- నాలుగు విడతల్లో ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికలు
- జూన్ 4న కౌంటింగ్
విధాత : దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలు సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ఆయన న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు.
ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ కానుండగా, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనుండగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాల్గవ దశ మే 13న, ఐదవ దశ మే 20న, ఆరవ దశ మే 25న, ఏడోదశ పోలింగ్ జూన్ 1న నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. వాటిలో తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక కూడా జరుగనుంది. మొదటి దశలోనే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి.
మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు
ఏపీలోని మొత్తం 175అసెంబ్లీ స్థానాలకు, 25లోక్‌సభ స్థానాలకు, ఒడిస్సాలోని 28అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలను నాలుగవ దశలో మే 13న నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వాహణకు నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల చేస్తారు. ఏప్రిల్ 25న వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన తిరస్కరణ, ఏప్రిల్ 29న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.
తొలి దశలో ఏప్రిల్ 19న 21రాష్ట్రాల్లోని 102లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
అరుణాచల్ ప్రదేశ్‌లోని 2, అస్సాం 5, బీహార్‌లో 4, చత్తీస్‌ఘడ్‌లో1, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్ర 5, మణిపూర్ 2,మేఘాలయా 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, రాజస్థాన్ 12, సిక్కిం 1, తమిళనాడు 39, త్రిపుర 1, యూపీ 8, ఉత్తరాఖండ్ 5, పశ్చిమ బెంగాల్ 3, అండమాన్, నికోబార్ 1, జమ్మూకాశ్మీర్‌లో 1, లక్ష్యద్వీప్‌లో 1, పుదుచ్చేరిలో 1 స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లోని 60అసెంబ్లీ స్థానాలకు, సిక్కిం అసెంభ్లీ 32స్థానాలకు కూడా తొలి దశలోనే ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్, 27వరకు నామినేషన్ల స్వీకరణ, 28న పరిశీలన, తిరస్కరణ, 30న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. అయితే బీహార్‌లో మాత్రం మార్చి 28వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, ఏప్రిల్2న ఉపసంహరణ ఉండనుంది.
రెండో దశలో ఏప్రిల్ 26న 13రాష్ట్రాల్లోని 89లోక్ సభ స్థానాలకు ఎన్నికలు
అస్సాంలో 5, చత్తీస్‌ఘడ్‌లో 3, బీహార్‌లో 5, కర్ణాటకలో 14, కేరళాలో 20, మధ్యప్రదేశ్ 7, మహారాష్ట్రలో 8, మణిపూర్‌లో 1,రాజస్థాన్‌లో 13, త్రిపురలో 1, యూపీలో 8, పశ్చిమబెంగాల్‌లో 3, జమ్మూకాశ్మీర్‌లో 1, స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 28న నోటిఫికేషన్, ఏప్రిల్ 4వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రీల్ 5న పరిశీలన, తిరస్కరణ, 8న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు.
మూడో దశలో మే 7న 12 రాష్ట్రాల్లో 94లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
అస్సాం 4, బీహార్ 5, చత్తీస్‌ఘడ్ 7, గోవా 2, గుజరాత్ 26, కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 8 , మహారాష్ట్ర 11, యూపీ 10, పశ్చిమ బెంగాల్ 4, దాద్రానగర్ హవాలీ డామన్ డయ్యూ 2, జమ్మూకాశ్మర్‌లో 1 స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న నోటిఫికేషన్, 19వరకు నామినేషన్ల స్వీకరణ, 20న పరిశీలన, తిరస్కరణ, 22న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు.
నాల్గవ దశలో మే 13న 10రాష్ట్రాల్లో 96లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో 25, బీహార్‌లో 5, జార్ఞండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిస్సాలో 4, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమబెంగాల్‌లో 8, జమ్మూకాశ్మీర్‌లో 1 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వాటితో పాటు ఏపీలోని మొత్తం 175అసెంబ్లీ స్థానాలకు, 25లోక్‌సభ స్థానాలకు, ఒడిస్సాలోని 28అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నాల్గవ విడతలో నిర్వహిస్తారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్, 25వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, తిరస్కరణ, 29న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు.
ఐదవ దశలో మే 20న 8 రాష్ట్రాల్లో 49లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
బీహార్‌లో 5, జార్ఞండ్‌లో 3, మహారాష్ట్రలో 13, ఒడిస్సాలో 5, యూపీలో 14, పశ్చిమ బెంగాల్‌లో 7, జమ్మూకాశ్మీర్‌లో 1, లడ్డాక్‌లో 1 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒడిస్సాలోని 35అసెంబ్లీ స్థానాలకు కూడా ఇదే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26న నోటిఫికేషన్, మే 3వరకు నామినేషన్ల స్వీకరణ, 4న పరిశీలన, తిరస్కరణ, 6న ఉపసంహరణ నిర్వహిస్తారు.
ఆరవ దశలో మే 25న 7రాష్ట్రాల్లో 57లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
బీహార్‌లో 8, హర్యానాలో 10, జార్ఖండ్‌లో 4, ఒడిస్సాలో 6, యూపీలో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే ఒడిస్సాలోని 42అసెంబ్లీ స్థానాలకు వాటితో పాటు ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 29న నోటిఫికేషన్, మే 6వరకు నామినేషన్ల స్వీకరణ, 7న పరిశీలన, తిరస్కరణ, 9న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు.
ఏడవ దశలో జూన్ 1న 8రాష్ట్రాల్లో 57లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
బీహార్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఞండ్‌లో 3, ఒడిస్సాలో 6, పంజాబ్‌లో 13, యూపీలో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, ఛండీఘర్‌లో 1 స్తానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఒడిస్సాలోని 42అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 7వ తేదీన నోటిఫికేషన్, మే 14వరకు నామినేషన్ల స్వీకరణ, 15న పరిశీలన, తిరస్కరణ, 17న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు.