Site icon vidhaatha

Gold Rate today | మగువలకు షాక్‌..! మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!

Gold Rate today |

బంగారం ధరలు వినియోగదారులకు షాక్‌నిస్తున్నాయి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇటీవల ధరలు గతంలో ఎన్నడూలేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరాయి. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. కొద్దిరోజులుగా ఓ రోజు పెరిగే.. మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి. కొండంత పెరిగితే గోరంత తగ్గుతున్నాయి.

తాజాగా ఆదివారం దేశంలో పుత్తడి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి.. రూ.55,850కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారంపై రూ.110 పెరిగి.. రూ.60,930 వద్ద స్థిరపడింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56వేలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,930 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.55,850 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.60,930గా ఉన్నది.

చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.56,330 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,440 వద్ద ఉన్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.55,900, మేలిమి బంగారం తులానికి రూ.60,980 ధర పలుకుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్త ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930 వద్ద ట్రేడవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే స్థిరంగానే కొనసాగుతున్నాయి.

కిలో వెండి రూ.76,200 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 80,400 పలుకుతోంది. మరో వైపు ప్లాటినం రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రూ.150 వరకు తగ్గి తులం రూ.28,220కి చేరింది.

Exit mobile version