Gold Price |
విధాత: బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు దిగి వచ్చిన ధరలు.. ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. అయితే, గత నాలుగైదు రోజుల్లో స్వల్పంగా ధరలు తగ్గ.. ఇవాళ ఒకే రోజు రూ.300పైగా పెరిగింది.
పెరిగిన ధరలతో హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.60,760కి పెరిగింది. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.80,400 ధర పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.60,760 వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు వెండి కిలో ధర రూ.80,400గా ఉన్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ.55,850 ధర పలుకుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,910 వద్ద కొనసాగుతున్నది.
ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,760కి పెరిగింది. మరో వైపు ప్లాటినం ధర పది గ్రాములకు రూ.180 తగ్గి 26,230కి చేరింది.