Site icon vidhaatha

లిఫ్ట్ గుంతలో పడి రిటైర్డ్ ఉద్యోగి మృతి

విధాత: కూతురు పుట్టినరోజు వేడుకలకు హాజరైన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి లిఫ్ట్ గుంతలో పడి మృతి చెందిన విషాద ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. మాన్యం చెల్కకు చెందిన నరసింహ(70) తన కుమార్తె పుట్టినరోజు వేడుకను మంగళవారం రాత్రి డీవీకే రోడు్డ‌లో గల లీఫ్ హోటల్లో నిర్వహించారు.

అయితే బంధువులతో కలిసి నరసింహ రెండో అంతస్తు నుంచి లిఫ్టులో పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా లిఫ్ట్ గేటు తెరుచుకున్నప్పటికీ లిఫ్ట్ బాక్స్ మాత్రం మూడో ఫ్లోర్‌లోనే ఉండిపోయింది. నరసింహ తొందరలో అడుగు వేయడంతో లిఫ్ట్ గుంతలో పడి మృతి చెందాడు. దీంతో విషాద‌ఛాయ‌లు అలుపుముకున్నాయి.

Exit mobile version