Site icon vidhaatha

మంత్రి జగదీశ్‌ రెడ్డి అదనపు కార్యదర్శి శర్మ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్

విధాత‌: రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వద్ద అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న డి.ఎస్‌.వి శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ను సైబర్ దొంగలు హ్యాక్ చేశారు.

ఆయన పర్సనల్‌గా పెట్టుకున్న కోడ్‌ను ఢీకోడ్ చేసిన దుండగులు శర్మ ఇన్‌స్టాగ్రామ్ నుండి డబ్బులు పంపించాలంటూ మెసేజ్‌లు పెట్టారు.

శర్మ స్వభావం తెలిసిన మిత్రులు ఈ విషయాన్ని శర్మ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో అప్రమత్తమైన అదనపు కార్యదర్శి శర్మ హుటాహుటిన హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కొంతమంది అమ్మాయిల ఇన్‌స్టాగ్రామ్‌ను డికోడ్ చేసిన దుండగులు వారి వారి బంధువులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టారంటూ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

Exit mobile version