Moon Europa | జుపిటర్‌ చంద్రుడిపై జీవం ఉందా..? షాకింగ్‌ విషయాలు వెల్లడించిన నాసా స్పేస్‌క్రాఫ్ట్‌..!

  • Publish Date - March 18, 2024 / 02:30 AM IST

Moon Europa | అనంత విశ్వంలో ఎన్నో నిగూఢమైన రహస్యాలున్నాయి. కాలాంతరంలో ఎన్నో రహస్యాలను ఛేదిస్తూ వస్తున్నారు. అలాగే, భూమిని పోలిన గ్రహాల కోసం శాస్త్రవేత్తలో నిత్యం గాలిస్తున్నారు. భూమి అంతమైతే మరో గ్రహంపైకి వెళ్లి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటికే భూమిని పోలిన గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ భూమి తరహాలోనే వాతావరణం ఉంటుందని ప్రాథమికంగా గుర్తించినా.. పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు మరో కీలక ప్రకటన చేశారు. బృహస్పతి (Jupiter) గ్రహం ఉపగ్రహాల్లో యూరోపా ఒకటి. యూరోపాలో భూమిలాంటి జీవం ఉండవచ్చని నాసా కీలక ప్రకటన చేసింది.

యూరోపా ఉపరితలంపై నీరు, ఆక్సిజన్‌ ఉండడమే దీనికి ప్రధాన కారణం. యూరోపాలో మానవ ప్రాణాలను నిలబెట్టేంత ఆక్సిజన్‌ ఉత్పత్తి కావడం లేదని సమాచారం. నాసాకు చెందిన జూనో స్పేస్‌క్రాఫ్ట్‌ జుపిటర్‌ గ్రహం చుట్టూ చక్కర్లు కొడుతున్నది. అంతరిక్ష నౌక ఇటీవల బృహస్పతి చందుడ్రిలో జీవం మనుగడకు ఛాన్స్‌ ఉన్నా.. ఆక్సిజన్‌ కొరత ఉండవచ్చని వెల్లడించింది. సెప్టెంబర్‌ 2022లో బృహస్పతి చుట్టూ తిరుగుతున్న జూనో వ్యోమనౌక పంపిన డేటా విశ్లేషణ ఆధారంగా నేచర్ ఆస్ట్రానమీ అనే సైన్స్ జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది. జుపిటర్‌ చంద్రుడి ఉపరితలం సమృద్ధిగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుందని, అయితే ఇది సెకనుకు 18 కిలోగ్రాముల ఆక్సిజన్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో జామీ స్జలే, ఆయన పరిశోధనా బృందం నిర్ధారించింది.

ఇది మునుపటి కంప్యూటర్ మోడ‌ల్స్‌ అంచనా వేసిన సెకనుకు సుమారు వెయ్యి కంటే చాలా తక్కువ. అయితే, సూక్ష్మజీవుల మనుగడకు అనుకూలంగా ఉన్నాయని ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త మనస్వి లింగం చెప్పారు. బృహస్పతి చంద్రుడు యూరోపా ఉపరితలం కింద భారీగా నీటి నిల్వ ఉంది. అయితే, ఉపరితలంపై ఏమాత్రం నీటి ఉపయోగం లేదని గుర్తించారు. సూర్యరశ్మి లేకపోవడంతో మొక్కలు ఉపరితలంపై కిరణజన్య సంయోగక్రియ చేయలేవని గుర్తించారు. కానీ వందల మిలియన్ల సంవత్సరాలలో మహాసముద్రాల మంచుతో కప్పబడిన పైకప్పులపై పేరుకుపోయిన పోషకాలన్నీ అనేక భౌగోళిక ప్రక్రియల ద్వారా దిగువ చేరుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Latest News