Nallu Indrasena Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి ఇంద్రాసేనా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంద్రసేనా రెడ్డి రాజకీయ నేపథ్యం..
1953, జనవరి 1న జన్మించారు. 1983, 1985, 1999లో జరిగిన ఎన్నికల్లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1989, 1994లలో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీ సభాపక్ష నేతగా పని చేశారు. 2003 నుంచి 2007 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2004లో నల్లగొండ, 2014లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.