Nanded Hospital | మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గడిచిన 8 రోజుల్లో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 11 మంది రోగులు చనిపోయారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి డీన్ శ్యామ్ వాకోడ్ మాట్లాడుతూ.. హాస్పిటల్‌లో ఎలాంటి మందుల కొరత లేదని స్పష్టం చేశారు. గడిచిన 24 గంటల్లో 1,100 మందికి పైగా రోగులను వైద్యులు పరీక్షించారని తెలిపారు. ఇందులో 191 మంది రోగులకు చేర్చుకుని చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని, వీరంతా పుట్టుకతోనే జన్యుపరమైన లోపాలతో పుట్టిన వారని పేర్కొన్నారు. మందుల కొరత కారణంగా ఏ రోగి కూడా చనిపోలేదని ఉద్ఘాటించారు. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారు, జన్యులోపాలతో పుట్టిన పిల్లలు చనిపోయారని తెలిపారు. రోగులకు హాస్పిటల్ సిబ్బంది ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అందిస్తున్నారని చెప్పారు. మూడు నెలలకు సరిపడా మెడిసిన్స్‌ను నిల్వ చేసుకుంటామన్నారు.