Site icon vidhaatha

BRS MLC Kavitha | సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు..! ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు..!

BRS MLC Kavitha | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవతకు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ జరిపిన జరిపిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. తనకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పి.. అలా చేయలేదరని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారని తెలిపారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం.. ఓ మహిళను ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉందని, తనను ఈడీ కార్యాలయానికి పిలువడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం.. 16న విచారణకు హాజరవడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, అత్యవసర విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. ఈ నెల 24న పిటిషన్‌పై వాదనలు విననున్నట్లు చెప్పింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈడీ కార్యాలయానికి విచారణకు పిలిచారని సీజేఐ ధర్మాసనం ముందు కవిత తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఒక మహిళను ఇప్పుడు ఈడీ విచారణ కోసం పిలుస్తోందదని, ఇది చట్టానికి విరుద్ధమని తెలిపారు. ఇదిలా ఉండగా.. కవిత బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 16న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమెను విచారించనున్నారు. ఇంతకు ముందు ఈ నెల 11న రామచంద్ర పిళ్లైతో పాటు కవితను విచారించింది. లిక్కర్‌ పాలసీ వ్యవహారంపై కీలక అంశాలపై ఈడీ కవితను ప్రశ్నించింది. దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన అనంతరం 16న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Exit mobile version